బండ్ల గణేష్ కు బ్రేక్ లు వేసిన నరేంద్ర మోడీ!

bandla-ganesh-poultry-up-politicsక్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా చిన్న చిన్న వేషాలతో ‘బ్లాక్ బస్టర్’ నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్, తెలంగాణాలో పౌల్ట్రీ ఇండస్ట్రీలో తనే నెంబర్ 1 అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసాడు. తొలుత రెండు వేల కోళ్లతో ప్రారంభించిన వ్యాపారం, ఇప్పుడు పాతిక లక్షల కోళ్లకు విస్తరించి, తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని, అలాగే తన వ్యాపార ప్రస్థానంలో, పౌల్ట్రీ బిజినెస్ ను ఉత్తరప్రదేశ్ కు కూడా విస్తరించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు బండ్ల గణేష్ తెలిపాడు.

అక్కడ పౌల్ట్రీ ఫామ్ లు పెట్టేందుకు 100 ఎకరాల భూమిని, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తనకు తక్కువ ధరకే కేటాయించారని బండ్ల తెలిపాడు. అలాగే దీని కోసం మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సహకరించారని కూడా వివరించారు. అయితే ఇదే సమయంలో… జరుగుతున్న ఎన్నికలలో అఖిలేష్ ముఖ్యమంత్రి అయితేనే అక్కడ పౌల్ట్రీ పెడతానని, ఒకవేళ అఖిలేష్ ఓడిపోతే ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆయన గెలిచిన తర్వాత పెడతానని చెప్పాడు.

ADVERTISEMENT

మరి తాజాగా వెల్లడైన ఫలితాలలో సమాజ్ వాదీ పార్టీ ఘోర ఓటమిని చవిచూడగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ ఏర్పాటు కాబోతోంది. దీంతో బండ్ల గణేష్ వ్యాపార విస్తరణ ప్రస్తుతానికి ఆగిపోయినట్టే. అయితే బండ్ల గణేష్ కు ఈ పరిస్థితి రావడానికి పరోక్షంగా నరేంద్ర మోడీయే కారణంగా నిలుస్తోంది. ‘నమో’ మంత్రంతో యూపీ ప్రజానీకం అంతా మోడీ వెంట నిలవడంతో, అనూహ్యంగా బిజెపి పగ్గాలు చేపట్టింది. దీంతో బండ్ల గణేష్ వ్యాపార విస్తరణకు బ్రేక్ పడింది.

ADVERTISEMENT
Latest Stories