దాదాపు 23 ఏళ్ల ప్రయాణం.. లిరిక్ రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి సంగీత దర్శకుడిగా 14 ఏళ్ల నుండి ప్రయత్నిస్తూనే ఉన్నా.. మొదటి బ్రేక్ మాత్రం “ధమాకా” చిత్రంతో వచ్చింది భీమ్స్ కి. ఆ సినిమాలోని ఫోక్ సాంగ్ సెన్సేషనల్ గా వైరల్ అవ్వడంతో.. కేవలం ఆ పాట కోసమే థియేటర్లకి వచ్చిన జనాలు కూడా ఉన్నారు.
ఆ తర్వాత వరుసబెట్టి సినిమాలు చేసినా.. “బలగం, మ్యాడ్” తప్ప మరో సినిమా సంగీత దర్శకుడిగా అతడ్ని నిలబెట్టలేకపోయాయి. అయితే.. “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో ఒక్కసారిగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల ఖాతాలో చేరిపోయాడు భీమ్స్. ఆ దెబ్బకి రెమ్యునరేషన్ పెరిగింది, రేంజ్ పెరిగింది.
కాకపోతే.. ఆ తర్వాత వచ్చిన “మాస్ జాతర”తో తీవ్రంగా నిరాశపరిచాడు భీమ్స్. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో విపరీతమైన నెగిటివిటీ ఫేస్ చేయాల్సి వచ్చింది. అయితే.. ఆ విషయాన్ని భీమ్స్ పెద్దగా పట్టించుకోలేదు, సింపుల్ గా నేను సోషల్ మీడియాలో లేను, డైరెక్టర్ ఓకే చేసిన ట్యూన్స్ & పాటలే బయటికి వచ్చాయి, సినిమాకి ఫ్లాప్ అవ్వడానికి తాను కారణం కాదు అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ కాస్త వైరల్ అయ్యింది కూడా.
అయితే.. భీమ్స్ రీసెంట్ వర్స్క్ “మన శంకర వరప్రసాద్ గారు, భారతమహాశయులకు విజ్ఞప్తి” వంటి సినిమాల పాటలు ఒకట్రెండు తప్ప టోటల్ గా ఆల్బమ్ మాత్రం జనాల్ని మెప్పించలేకపోయింది. ఇక “ఫంకీ” పాటల్లో ఒక్కటి కూడా జనాల ఆదరణను చూరగొనలేదు.
రీసెంట్ గా వచ్చిన “డెకాయిట్” విషయంలోనూ అదే జరిగింది. “రూబారు, చిచ్చుబుడ్డి” వంటి పాటలు రిలీజ్ టైమ్ లో చేసిన హడావుడికి తర్వాత జనాల రెస్పాన్స్ కి సంబంధం లేకుండాపోయింది.
నిన్న నిర్వహించిన “డెకాయిట్” సక్సెస్ మీట్ లో కూడా చిత్రబృందం బ్యాగ్రౌండ్ స్కోర్ చేసిన జ్ఞానిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారే తప్ప.. ఒక్కరు కూడా భీమ్స్ ని తలుచుకోలేదు. భీమ్స్ ప్రస్తుతం హిందీ వెర్షన్ “సంక్రాంతికి వస్తున్నాం”కి పాటలు సమకూర్చే పనిలో పడ్డాడు. అది కాకుండా మరో ఆరేడు సినిమాలు లైన్ లో ఉన్నాయి.
కానీ.. భీమ్స్ తనను తాను అప్డేట్ చేసుకోకపోతే మాత్రం చాలా ఫాస్ట్ గా బోర్ కొట్టేసి.. 23 ఏళ్లుగా కష్టపడి సంపాదించుకున్న కెరీర్ ను కాపాడుకోలేక చతికిలపడతాడు. ఈ విషయాన్ని భీమ్స్ కాస్త సీరియస్ గా అలోచింది, తనను తాను రీఇన్వెంట్ చేసుకోవడం ఉత్తమం.




