
ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి, పోలవరం పనులు పునః ప్రారంభించారు. రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయి. పెండింగులో ఉన్న రోడ్, రైల్వే ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతున్నాయి. భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి.
ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక్క ఛాన్స్‌తో ముఖ్యమంత్రి అయిన జగన్ చరిత్రలో నిలిచిపోయేందుకు ఇన్ని గొప్ప అవకాశాలు చేజార్చుకున్నారనిపించక మానదు. ఒకవేళ ఆయన వీటిలో ఏ ఒక్క పని పూర్తి చేసినా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయుండేవారు. కానీ ఒక్క ఛాన్స్‌తో కేవలం 5 ఏళ్ళలోనే రాష్ట్రాన్ని విధ్వంసం చేసినవాడిగా జగన్ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారు. అభివృద్ధిని విస్మరించి సంక్షేమ పధకాలతో 5 ఏళ్ళు గడిపేసిన ముఖ్యమంత్రిగా నిలిచిపోతారు.
Also Read – అందగాడికే ఇన్ని కష్టాలు…!
ఈ నెలలోనే అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని మోడీ చేత ప్రారంభింపజేయాలని సిఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. తద్వారా అమరావతి నిర్మాణానికి కేంద్రం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని చంద్రబాబు నాయుడి ఆశ. కనుక ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీని ఆహ్వానిస్తున్నారు.
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పౌర విమానయనశాఖ మంత్రి కావడం కూడా ఆంధ్రాకు చాలా కలిసి వచ్చింది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులపై ఆయన వ్యక్తిగతంగా శ్రద్ద చూపుతూ శరవేగంగా చేయిస్తున్నారు. దీనిని కూడా జీఎంఆర్ సంస్థ నిర్మిస్తోంది. దీని కోసం తొలి విడతలో రూ. 4,650 కోట్లు ఖర్చు చేస్తోంది.
ఆయన విమానాశ్రయంలో పర్యటించి పనుల పురోగతిని పరిశీలించిన తర్వాత వాటి గురించి మీడియాకు వివరించారు. వచ్చే ఏడాది (2026) జనవరిలో విమానాశ్రయం ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకొని శరవేగంగా పనులు చేస్తున్నారని చెప్పారు.
ఈ 9 నెలల్లో నిర్మాణ పనులను 71 శాతం పూర్తిచేశామని చెప్పారు. ఆయన చెప్పిన దాని ప్రకారం వివిద పనుల పురోగతి ఈవిదంగా ఉంది..
· మట్టి పనులు: 100 శాతం పూర్తి
· రన్ వే నిర్మాణం: 97 శాతం
· టాక్సీ వే: 92 శాతం
· టెర్మినల్ బిల్డింగ్: 60 శాతం
· ఏటీసీ: 72 శాతం
· ఇతర భవనాలు: 43 శాతం.
· యాక్సిస్ రోడ్లు: 37 శాతం