వైసీపీ ఎంపీలు 5 ఏళ్ళలో చేయలేని పని భూపతి వర్మ….

BJP Varma met Nitin gadkari

తెలంగాణలో కేసీఆర్‌ చేతిలో ఇదివరకు ఏడుగురు ఎంపీలు ఉంటేనే పార్లమెంటులో తెలంగాణకు రావలసిన నిధులు, ప్రాజెక్టుల గురించి గట్టిగా నిలదీస్తుండేవారు.

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేతిలో ఏకంగా 22 మంది వైసీపీ ఎంపీలున్నారు. కానీ జగన్‌తో సహా వైసీపీ ఎంపీలు అందరూ తమ కేసులు, కాంట్రాక్టులు, బిజినెస్, రాజకీయ వ్యవహారాలకే పరిమితమయ్యేవారు.

ADVERTISEMENT

ఈ విషయంలో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చక్కటి ఉదాహరణగా కనిపిస్తారు. ఆయన ప్రధాని మోడీ, హోంమంత్రి, ఆర్ధికమంత్రి తదితరులతో నిత్యం ఫోటోలు దిగుతూ, ఏపీ ప్రజలకు, ముఖ్యంగా… తన కుర్చీ కింద మంట పెడుతున్న వైసీపీ నాయకులకు తన పరపతిని చాటుకునేందుకు ప్రయత్నిస్తుండేవారు.

అలాగే జగన్‌ కేసులన్నిటిలో విజయసాయి రెడ్డి ఏ-2 కనుక ధిల్లీలో చక్రం తిప్పుతూ వాటిని ముందుకు కదలనీయకుండా గట్టిగా బ్రేకులు వేసి ఉంచుతుండేవారని గుసగుసలు వినిపిస్తూనే ఉండేవి. లేకుంటే వివేకా హత్య కేసులో సీబీఐ వెనకడుగు వేసేదే కాదు… ఆ కేసు విచారణకు ఇంతకాలం పట్టేదే కాదని జనుల అభిప్రాయం.

జాతీయ స్థాయి కాంట్రాక్టులు, వ్యాపారాలతో వైసీపీ ఎంపీలకు క్షణం తీరిక ఉండేది కాదు. ఇక గోరంట్ల మాధవ్, మిథున్ రెడ్డి వంటివారు సరేసరి. కనుక వైసీపీ ఎంపీలు రాష్ట్రం గురించి పెద్దగా ఆలోచించలేకపోయేవారని ప్రజలు సర్దుకుపోతుండేవారు.

కానీ జగన్‌, వైసీపీ ఎంపీలు కలిసి 5 ఏళ్ళలో ధిల్లీ నుంచి ఏపీకి ఏం సాధించారంటే ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చి మా నెత్తిన పెట్టారని ఆ భారం మోస్తున్న ప్రజలే చెపుతున్నారు.

కానీ బీజేపి ఎంపీ, భూపతిరాజు శ్రీనివాస వర్మ కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పదవి చేపట్టిన ఏడాదిలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు రూ.2,600 కోట్లు విలువైన రోడ్ ప్రాజెక్ట్ సాధించి పెట్టారు!

జిల్లాలో ఎన్‌హెచ్-165 కింద వచ్చే ఆకివీడు-కత్తిపూడి-భీమవరం బైపాస్ రహదారిని, ఎన్‌హెచ్-216 కింద వచ్చే కత్తిపూడి-ఒంగోలు మద్య నర్సాపురం బైపాస్ రోడ్ ప్రాజెక్టులను సాధించారు. దీని కోసం జిల్లా ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు.

రెండు రోజుల క్రితమే ఆయన కేంద్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఈ భారీ రోడ్ ప్రాజెక్టుకి ఆమోదముద్ర వేయించుకున్నారు కూడా!

వైసీపీ ఎంపీలు 5 ఏళ్ళలో చేయలేకపోయిన ఈ పనిని మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కేవలం ఏడాదిలో సాధించి ఉడతా భక్తిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి, ప్రజలకు సేవ చేశారు.

కనుక అదేదో సినిమాలో రజనీకాంత్ డైలాగ్ చెప్పినట్లు ఎంత పెద్ద గుంపు ఉందని కాకుండా, ఉన్నది ముచ్చటగా ముగ్గురే అయినా రాష్ట్రాభివృద్ధి కోసం ముగ్గురూ దిల్లీలో చకచకా పనులు చక్కబెట్టేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories