జూన్ 2 న కవిత కొత్త పార్టీ.?

BJP MP Raghunandan Rao: Kavitha New Party Launch on June 2

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన పార్టీ అధినేత, కన్న తండ్రి కేసీఆర్ కు రాసిన రాజకీయ లేఖ ఇప్పటికి తెలంగాణ రాజకీయాలలో నిప్పు ను రాజేస్తూనే ఉంది. కుడితిలో పడ్డ ఎలక మాదిరి అటు బిఆర్ఎస్ కవిత లేఖ మీద ఎటు స్పందించలేక ముఖం చాటేస్తూ కాలం వెళ్లదీస్తుంది.

ఇక బిఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ లకు మాత్రం కవిత లేఖ కోతికి కొబ్బరి చిప్ప దొరికినంత ఆనందాన్ని అందిస్తుంది. దీనితో తమ రాజకీయ రొటీన్ లో భాగంగా రోజుకోసారి కవితను అడ్డుపెట్టుకుని బిఆర్ఎస్ మీద కేసీఆర్ మీద విరుచుకుపడుతున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు.

ADVERTISEMENT

తాజాగా మీడియా ముందుకొచ్చిన బీజేపీ ముఖ్య నేత ఎంపీ రఘునందన్ బిఆర్ఎస్ పై మరో బాంబు పేల్చారు. జూన్ 2 న కేసీఆర్ కుమార్తె కవిత కూడా వైస్ షర్మిల మాదిరే తెలంగాణలో మరో రాజకీయ పార్టీని ఆవిర్భవించబోతున్నారు, ఆమె కూడా త్వరలోనే పాదయాత్ర కు సిద్ధమవుతున్నారు అంటూ గులాబీ కారుకి బ్రేక్ డౌన్ అయ్యే వార్త చెప్పారు.

అయితే రఘునందన్ ఆరోపిస్తున్నట్టుగా కవిత జూన్ 2 న తండ్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా మరో కొత్త పార్టీని ప్రారభించబోతున్నారా.? అంటే నిప్పు లేనిదే పొగ రాదుగా అనే సామెతను వల్లెవేస్తున్నారు బీజేపీ నేతలు. అయితే గతంలో వైస్సార్ కుమార్తె వైస్ షర్మిల కూడా ఇదే మాదిరి తన అన్నకు వ్యతిరేకంగా రాజకీయ అడుగులు వేయబోతున్నారు అంటూ ప్రచారం జరిగిన అతికొద్ది కాలానికే అది కార్యరూపం దాల్చింది.

ఇప్పుడు కవిత విషయంలో కూడా ఇదే మాదిరి డేట్ కాస్త అటు ఇటు అయినా కవిత కొత్త పార్టీతో తెలంగాణ రాజకీయాలలో అడుగు పెట్టడం మాత్రం ఖాయం అనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. కవిత విదేశాల నుంచి సొంత రాష్ట్రానికి వచ్చినప్పటికీ, ఈ లేఖ మీద తెలంగాణలో ఇంతలా రాజకీయం జరుగుతున్నప్పటికీ అటు కేసీఆర్ కానీ ఇటు కవిత కానీ కలిసి కూర్చుని మాట్లాడుకున్నట్టు వార్తలు రాలేదు, అటువంటి దృశ్యాలేమీ మీడియాలో కనిపించలేదు.

అలాగే ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత విషయంలో పరోక్ష వాదనలు వినిపిస్తున్నారే కానీ నేరుగా కవితను టార్గెట్ చేస్తూ అడుగు ముందుకు వేయడం లేదు. మరి కేసీఆర్ కుటుంబంలో మొదలైన ఈ లేఖ మిసైల్ గులాబీ కారును ధ్వంశం చేస్తుందా.? లేఖ కవిత రాజకీయ జీవితాన్ని సమాధి చేస్తుందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories