సోము వీర్రాజుకు పైనుండి అక్షింతలు పడ్డాయా?

AP BJP Leader Somu Veerraju Making a Mockery of Himselfబీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గత వారం రోజులుగా తెలుగు దేశం పార్టీపై విరుచుకు పడుతున్నారు. మేము లేకపోతే టీడీపీ ప్రభుత్వం లేదు అన్నట్టు ఊగిపోయారు. 2019 మేమే హీరోలం, ఎవరు గెలవాలో మేమే డిసైడ్ చేస్తాం అని హూంకరించారు. అయితే సహనం కోల్పోకుండా టీడీపీ నాయకులను కట్టడి చేసారు చంద్రబాబు.

మరో వైపు ఏమైందో తెలీదుగానీ ఉన్నట్టుండి సోము వీర్రాజు వెనక్కు తగ్గారు. తన వ్యాఖ్యలపై మీడియా ముఖంగా వివరణ ఇచ్చుకున్నారు. ముఖ్యమంత్రిని గానీ ప్రభుత్వవాన్ని గానీ ఎప్పుడు తాను తప్పు పట్టలేదని చెప్పుకొచ్చారు. పైగా ఒకానొక దశలో చంద్రబాబుని ‘మా ముఖ్యమంత్రి అని కూడా సంబోధించారు.

ADVERTISEMENT

టీడీపీ బలహీనపడితే బీజేపీ బలపడుతుందని తాను అనలేదని, రెండు పార్టీలు బలంగా ఉంటేనే పొత్తు బలంగా ఉంటాడని కూడా అన్నారు. మొత్తానికి వీర్రాజు వ్యవహారం అధిష్టానానికి చేరినట్టు ఉంది. పైనుండి ఆయనకు అక్షింతలు పడ్డాయా అనే అనుమానం అందరికి కలగక మానదు

ADVERTISEMENT
Latest Stories