బీజేపీ కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తుందా?

Narendra-Modi-Expectations-and-KCR-Priorities-Are-Differentతెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఈ మధ్య ఢిల్లీలో రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయినప్పుడు “రావుసాబ్ మీ ప్రభుత్వం రైతులకు పెట్టుబడిగా సంవత్సరానికి ఎకరాకు రూ. 8 వేలు ఇస్తామని ప్రకటించారు, అది ఎలా?” అని ప్రశ్నించారు.

“మాది కొత్త రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారు, వారిని ఆదుకోవడానికి ఇచ్చే పెట్టుబడి పూర్తిగా ఉచితమే, నయా పైసా చెల్లించాల్సిన అవసరం లేదు” అని చెబితే రాజ్‌నాథ్‌సింగ్‌కు చక్కరొచ్చినంత పని అయిందన్నారు అని కేసీఆర్ చెప్పారు.

ADVERTISEMENT

“అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుంది, మీరు కేంద్ర రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా’అని తిరిగి ఆయన ప్రశ్నించగా,‘అలాంటి ఆలోచన ఏమి లేదు, ఈ జన్మకు నా తెలంగాణ ప్రజలకు సేవ చేసుకుంటా’నని చెప్పానట్టు సిఎం వివరించారు. ఇలాంటి పథకం జాతీయ స్థాయిలో కూడా అమలు చెయ్యాలని ఎంపీ వినోద్ పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెట్టారు. కేసీఆర్ కు ఇంట్రస్ట్ ఉంటే బీజేపీ జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానించేదా?

ADVERTISEMENT
Latest Stories