
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే దానిలో ఉంటారు. కానీ తొలిసారిగా ఓడిపోయిన వైసీపిలోనే ఇంకా కొనసాగుతున్నారు. టిడిపిలోకి వెళ్ళేందుకు అవకాశం లేకపోవడం, బహుశః జనసేన తన స్థాయికి తగినది కాదనుకోవడం, కాంగ్రెస్ పార్టీ కోలుకోలేకపోవడం వలననే ఆయన ఇంకా వైసీపిలో ఉండిపోవలసి వచ్చిందేమో?
Also Read – శంకర్ కి సాధ్యం కానిది శేఖర్ కు సాధ్యం..!
ఒకవేళ జగన్ వైసీపిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తే ఎవరిచేత వేలెత్తి చూపించుకోకుండా మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకోవచ్చని ఎదురుచూస్తున్నారేమో కూడా.
ఇంతకీ విషయం ఏమిటంటే, ఆయన కూడా జమిలి ఎన్నికల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ, “నేను 2026 సంక్రాంతి పండుగ వరకు టిడిపి కూటమి ప్రభుత్వం, సిఎం చంద్రబాబు నాయుడుపై ఎటువంటి విమర్శలు చేయకూడదని అనుకున్నాను.
Also Read – యుద్ధాలతో కనపడే విధ్వంసం కొంత.. కనపడనిది అనంతం!
కానీ 2026 చివర్లో లేదా 2027లో జమిలి ఎన్నికలు వస్తాయని చంద్రబాబు నాయుడు చెపుతున్నారు. కనుక ప్రతీ రాజకీయ నాయకుడు చైతన్యంగా ఉండటం చాలా అవసరం. అందువల్లే ముందుగానే నోరు విప్పి మాట్లాడాల్సివస్తోంది,” అని అన్నారు.
అంటే బొత్స సత్యనారాయణతో సహా వైసీపి నేతలు తాము ప్రజలు, మీడియా దృష్టిలో నిలిచి ఉండేందుకే సిఎం చంద్రబాబు నాయుడు, ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు తప్ప ప్రజాసమస్యలు పరిష్కరింపబడాలనే ఉద్దేశ్యంతో కాదన్న మాట!
Also Read – కేసులతోనే అంబటి భయం పోగొట్టారుగా!
ఇటీవల అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ నేడు గుంటూరు బయలుదేరుతున్నారు. బొత్స సత్యనారాయణ చెప్పినదాని ప్రకారం చూస్తే, ఈ పేరుతో సిఎం చంద్రబాబు నాయుడుపై, ప్రభుత్వం జగన్ చేయబోయే విమర్శలు కూడా మీడియా, ప్రజల దృష్టిలో ఉండేందుకే అను అనుకోవాలేమో?