ఏపీలో వైసీపీ, తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ రెండింటి రాజకీయ పరిస్థితి, కేసులు, హామీల అమలుపై వాటి వాదనలు, వైఖరి అన్నీ ఒకేలా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది యాదృచ్ఛికమే కావచ్చు స్వయంకృతాపరాధం కారణంగానే వాటి పరిస్థితి నేడు ఈవిదంగా ఉందని అందరికీ తెలుసు.
తమ కుటుంబ సభ్యులు బాగుంటే తెలంగాణలో అందరూ బాగున్నట్లే. తమ కుటుంబానికి ఏదైనా కష్టం వస్తే తెలంగాణలో అందరికీ కష్టం వచ్చిన్నట్లేనని కేసీఆర్, కేటీఆర్, కవిత వాదిస్తుంటారు.
Also Read – కూటమిలో నేతలే వైసీపీకి నిప్పు అందిస్తున్నారా?
లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకి ఈడీ నోటీస్ పంపినా, అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా తెలంగాణ ఆడబిడ్డలందరికీ అన్యాయం జరిగిందన్నట్లు బిఆర్ఎస్ నేతలు వాదించేవారు.
ఇప్పుడు ఎఫ్-1 రేసింగ్ కేసులో కేటీఆర్ పీకలోతు కూరుకుపొగానే తెలంగాణ ప్రజలందరూ ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్‌లాగా పోరాటాలకు సిద్దం కావాలని నేడు ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈ ఏడాదిని పోరాటనామ సంవత్సరంగా పరిగణించి అందరం కలిసికట్టుగా పోరాడుదామని కేటీఆర్ పిలుపు ఇచ్చారు.
Also Read – దావోస్ సదస్సులో ముఖ్యమంత్రుల ఐఖ్యతారాగం.. శభాష్!
అయినా వారు అవినీతికి పాల్పడి కేసులలో చిక్కుకుంటే వారిని కాపాడుకోవడం కోసం తెలంగాణ ప్రజలు ఎందుకు పోరాడాలో అర్దం కాదు.
అక్కడ కేటీఆర్, ఇక్కడ జగన్ తమ హయాంలో స్వర్ణయుగమని, ఇప్పుడు రాక్షస పాలన సాగుతోందని వాదిస్తున్నారు.
Also Read – ఎక్కడ నేతలు అక్కడే గప్ చిప్..!
హామీలు అమలుచేయలేక రెండు ప్రభుత్వాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని, ప్రజలను మోసం చేస్తున్నాయని, అక్రమ కేసులు నమోదు చేయించి రాజకీయకక్ష సాధింపులకు పాల్పడుతున్నాయని వాదిస్తున్నారు.
అప్పుడే ప్రజలలో తీవ్రత వ్యతిరేకత వచ్చేసిందని కనుక మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చేస్తున్నామని, అప్పుడు ప్రతీ ఒక్కరిపై ప్రతీకారం తీర్చుకుంటామని బల్ల గుద్ది వాదిస్తున్నారు. శపధాలు చేస్తున్నారు.
అక్కడ కేసీఆర్, కేటీఆర్‌ల మెడకు ఉచ్చులు బిగుసుకుంటుంటే, ఇక్కడ జగన్‌కు మినహాయింపు లభిస్తోంది. కానీ వైసీపీ నేతల మెడలకు ఉచ్చులు బిగుసుకుంటున్నాయి.
బిఆర్ఎస్ పార్టీకి, వైసీపీకి ఒక్కటే తేడా కనిపిస్తోంది. కేటీఆర్, హరీష్ రావు, కవిత తదితరులు ప్రజల మద్య ఉంటూ ప్రజలకు ఈ హితబోధలు చేస్తుంటే, జగన్ ప్యాలస్‌లో ఉంటూ పార్టీ నేతలకు, కార్యకర్తలకు హితభోదలు చేస్తున్నారు. మిగిలినదంతా సేమ్ టూ సేమ్!