
తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పుట్టిన తెరాస పార్టీ తెలంగాణలో కనుమరుగు కాబోతుంది అన్న వార్త రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారినప్పటికీ ఆ పార్టీ అధినేత కేసీఆర్ లో మాత్రం చలనం పుట్టించలేకపోయింది. మీడియా ముందుకొచ్చి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేకపోతున్నారు కేసీఆర్.
Also Read – వాఘా మూసేసి సరిహద్దులు తెరుస్తామంటున్న పాక్ పాలకులు!
దీనికి కారణం కవిత అరెస్టు కావచ్చు, ఓటమి నైరాశ్యం కావచ్చు, మరేమైనా కారణం కావచ్చు. అయితే తెలంగాణలో ఎన్నికల ఫలితాల తరువాత బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కాబోతుంది అంటూ బీజేపీ నేతలు ప్రచారం చేస్తుంటే, కవిత బైలు కోసం బిఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నారు కేసీఆర్ అంటూ కాంగ్రెస్ నేతలు వార్తలను ప్రచారం చేస్తున్నారు.
అయితే ఇక్కడ కనుమరుగు కాబోతున్న పార్టీ బిఆర్ఎస్ అనేది స్పష్టమయింది కానీ ఏ పార్టీలో విలీనం అన్నది ఇంకా ఒక క్లారిటీ రాలేదు. అసలు విలీనం ఉందా లేదా అన్న విషయంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎటువంటి దృఢమైన స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. అయితే 2023 ఎన్నికల ప్రచారంలో కాస్త అటు ఇటుగా ఇదే తరహా రాజకీయం చేస్తూ బీజేపీని సెంటర్ చేసాయి కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు.
Also Read – భారత్‌లో పాకిస్తానీలు.. ఓటు బ్యాంక్ రాజకీయాలు!
బీజేపీతో లోపాయికారి ఒప్పందాలు పెట్టుకుని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోడానికి కేసీఆర్ పావులు కదుపుతున్నారు అంటూ కాంగ్రెస్ నేతలు బిఆర్ఎస్ పై విరుచుకుపడితే, బీజేపీతో రహస్య మంతనాలు జరుపుతూ తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టడానికి కాంగ్రెస్ నేతలు సిద్దమయ్యారంటూ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ పై నిప్పులు చెరిగింది.
ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల తలరాతలు తారుమారవవడంతో తెలంగాణలో రాజకీయ లేఖలు మారాయి. అప్పుడు బీజేపీ సెంటర్ గా రాజకీయం జరిగితే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీని సెంటర్ చేస్తూ రాజకీయం చేస్తున్నాయి కాంగ్రెస్, బీజేపీ లు. జాతీయ పార్టీగా ఎదగాలనుకున్న బిఆర్ఎస్ ఇలా రెండు జాతీయ పార్టీల మధ్య ‘విలీనమనే’ రాజకీయ ఉచ్చులో పడి ఉనికి కోసం ఆరాటపడుతుంది.
Also Read – కేసులు, విచారణలు ఓకే.. కానీ కేసీఆర్, జగన్‌లని టచ్ చేయగలరా?