
తెలంగాణలో కాంగ్రెస్‌లో చేరిన 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీకి ఊహించని షాకులు ఇస్తున్నారు. వారిపై అనర్హత వేటు వేయాల్సిందిగా కోరుతూ బిఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
Also Read – అభిమానుల కలల సీజన్ ఇదేనా..?
దానిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు వారికి నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించింది. వారిలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డితో సహా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కౌంటర్ దాఖలు చేశారు. అయితే సుప్రీంకోర్టు కూడా ఊహించని వివరణ వారిచ్చారు.
ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్‌లో “నేను పార్టీ మారలేదు. ఏ పార్టీలో చేరలేదు. బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు. నేటికీ నేను బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాను.
Also Read – ఇటు అమరావతి…అటు విశాఖ…!
ఓ ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డిని కలిసిన మాట వాస్తవం. దానినే మీడియా వక్రీకరించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తప్పుగా చెప్పాయి.
నేను పార్టీ మారలేదు. నేటికీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాను కనుక నాపై అనర్హత వేటు వేయాలంటూ నా సహచర బిఆర్ఎస్ ఎమ్మెల్యే వేసిన పిటిషన్‌ని కొట్టివేయాలని కోరుతున్నాను,” అని సుప్రీంకోర్టుని అభ్యర్ధించారు.
Also Read – సీఎం నినాదాలు: పార్టీ శ్రేణుల అత్యుత్సాహం…
మరో ఇద్దరు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇంచుమించు ఇదే చెప్పి తమకి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ని కొట్టివేయాలని సుప్రీంకోర్టుని అభ్యర్ధించారు.
సిఎం రేవంత్ రెడ్డి, సీనియర్ మంత్రులు వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆ ఫోటోలు, వీడియోలు, వార్తలు మీడియాలో వచ్చాయి. కనుక వారు సుప్రీంకోర్టుని మభ్యపెడుతున్నారని అర్దమవుతూనే ఉంది.
కానీ మీడియాలో వచ్చిన వార్తలను సుప్రీంకోర్టు సాక్ష్యాధారాలుగా పరిగణించదు కానీ వారు తమని తప్పు దోవ పట్టిస్తున్నారనే విషయం మాత్రం గ్రహించగలదు.
కనుక కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.