చంద్రబాబు వద్దు.. లోకేష్‌ ముద్దు!

KTR Warning

అవును. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధినేతలు ఈ మాట అంటున్నారు. తెలంగాణ రాజకీయాలలో మళ్ళీ చంద్రబాబు నాయుడు వేలు పెట్టడానికి వీల్లేదనే కేసీఆర్‌ ఏకపక్ష తీర్మానాన్ని ఆయన కుమారుడు కేటీఆర్‌తో సహా బిఆర్ఎస్ నేతలందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తుంటారు. కానీ తమకు నారా లోకేష్‌ ఆదర్శం, స్పూర్తి అవసరమంటారు.

ఆంధ్రాలో ‘రెడ్‌బుక్‌’ రాజ్యాంగం అమలవుతోందంటూ తీవ్ర విమర్శలు చేస్తున్న జగన్‌ కూడా వైసీపీ నేతలు ‘బ్లూబుక్’లు వ్రాయడం మొదలుపెట్టాలని సూచిస్తున్నారు. మనం అధికారంలోకి వచ్చాక ఆ ‘బ్లూబుక్’ రాజ్యాంగం అమలుచేద్దామని జగన్‌ చెపుతున్నారన్న మాట!

ADVERTISEMENT

తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ యువరాజు కేటీఆర్‌, యువరాణి కల్వకుంట్ల కవిత ఇద్దరూ కూడా ‘గులాబీ డైరీ’ మొదలుపెడతామని, దాని ప్రకారమే తాము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ నేతలని, తమను వేధించిన పోలీస్ అధికారుల భరతం పడతామని హెచ్చరిస్తున్నారు.

ఈరోజు కరీంనగర్‌లో కేటీఆర్‌ మాట్లాడుతూ, “నేను మా నాన్నగారు కేసీఆర్‌ అంత మంచోడిని కాను. మళ్ళీ మనం అధికారంలోకి రాగానే మన కార్యకర్తలని వేధించిన ఒక్కొక్కడికీ తాట తీస్తా. ఎవరైనా విదేశాలకు పారిపోతే అక్కడి నుంచి రప్పించి మరీ తాట తీస్తా,” అని హెచ్చరించారు.

నాడు యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ ఈవిదంగా మాట్లాడితే విమర్శించిన వైసీపీ, బిఆర్ఎస్ పార్టీ నేతలే నేడు ఆయన మాటలను, ఆలోచనలను, విధానాలను అనుకరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ చంద్రబాబు నాయుడుని వద్దనుకుంటారు. కానీ ఆయన కుమారుడు నారా లోకేష్‌ని ఆదర్శంగా భావిస్తుండటం విచిత్రంగానే ఉంది కదా?

ADVERTISEMENT
Latest Stories