వైసీపీ పాలన విధానాలలో లోపాలను ఎత్తిచూపుతున్న విపక్ష నేతలపై విరుచుకుపడుతున్న వైసీపీ నాయకులు ఇప్పుడు కాగ్ నివేదికను కూడా తప్పుపడతారా? లేక ఇది కూడా ప్రతిపక్షాల కుట్ర అంటూ ముగిస్తారా? జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తన సొంత ఆలోచనతో ఉన్న వాటికి పేర్లు మార్చకుండా ఏర్పాటు చేసిన ఒకే ఒక వ్యవస్థ ఈ వార్డు సచివాలయ వ్యవస్థ.
జగన్ ఏర్పాటు చేసిన వార్డు సచివాలయ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమని ,ఈ వాలంటీర్ వ్యవస్థలో జరిగే లోపాలకు బాధ్యత ఎవరు వహిస్తారో, దీనికి అధినేత ఎవరో చెప్పాలంటూ పవన్ తన వారాహి యాత్రలో జగన్ ప్రభుత్వాన్ని సూటిగానే ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థలో జరిగే అవకతవకలను అటు లోకేష్ కూడా తన యువగళం పాదయాత్రలో ప్రజలు ముందుంచారు. వైసీపీ ఎంపీ ఆర్ఆర్ఆర్ తన రచ్చబండ కార్యక్రమంలో వార్డు సచివాలయ వ్యవస్థను ఒక మాఫియాగా అభివర్ణించారు. వీటన్నిటికీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ప్రతిపక్ష నేతలు వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలి.
ప్రతిపక్షాల వాదనని బలపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వార్డు సచివాలయ వ్యవస్థ గ్రామా స్వరాజ్యానికి విరుద్ధమని, 74 వ రాజ్యాంగ సవరణ చట్టానికి అనుగుణంగా లేదని కాగ్ తన నివేదికలో పేర్కొంది. రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో ప్రమేయం లేకుండా ఏర్పాటు చేసిన ఈవాలంటీర్ వ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని కాగ్ తన నివేదికలో పొందుపరిచింది.
విపక్షాల సూచనలపై విరుచుకు పడినట్టే ఇప్పుడు కాగ్ పై కూడా వైసీపీ గ్యాంగ్ తన మాటల దాడులను కొనసాగిస్తుందేమో? లేక కాగ్ కూడా వాలంటీర్ వ్యవస్థకు క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తారో? చూడాలి.



