చంద్రబాబు నాయుడి ఫేక్ వీడియో… పరాకాష్టేగా?

Call for Ministry to Counter Political Fake News in AP

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ తమ దేశ రక్షణశాఖ పేరుని యుద్ధశాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్)గా మార్చారు. ఎందుకంటే ఏడు యుద్ధాలు ఆపిన ఆ శాంతిదూత నిత్యం ఏదో ఓ దేశంతో యుద్ధం చేస్తూనే ఉన్నారు కనుక!

అలాగే ఏపీలో కూడా… ఆ మాటకొస్తే…. దేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని, వాటి ఫేక్ ఫోటోలు, వీడియోలను కనిపెట్టి వాటి వెనుక ఉన్నవారిని పట్టుకునేందుకు ప్రభుత్వంలో ఓ ప్రత్యేక మంత్రిత్వశాఖని, దానికో మంత్రిని నియమించుకోవలసిన అవసరం నానాటికీ పెరిగిపోతోంది.

ADVERTISEMENT

జగన్‌ హయంలో 50 మందికి పైగా సలహాదారులను, వారికి హెడ్డుగా సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డిని పెట్టుకుని వారితో టీడీపి, జనసేన పార్టీలను, వాటి అధినేతలు, ముఖ్యనేతలని టార్గెట్ చేయించారు కదా? ‘ఐ ప్యాక్’కి వందల కోట్లు ఫీజు చెల్లించి దాని చేత కూడా ప్రతిపక్షాల మీద బురద జల్లించారు కదా?

అలాగే నేటికీ వైసీపీ దుష్ప్రచారం చేస్తూనే ఉంది. కనుక దాని దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వంలో కూడా ఓ మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసుకోవలసిన అవసరం కనిపిస్తోంది.

వైసీపీకి జవాబు చెప్పడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు కదా?అని అనుకోవచ్చు.

కానీ ఉగ్రవాదులను కనిపెట్టడానికి ట్రాఫిక్ పోలీసులు పనికిరారు. అలాగే ట్రాఫిక్ పోలీస్ పనులు చేయడానికి కమెండోలు పనికిరారు కదా? అలాగే వైసీపీ దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యేక శిక్షణ పొందిన మంత్రి, మంత్రిత్వశాఖ, అధికారులు చాలా అవసరం.

ట్రాఫిక్ పోలీసులను బందోబస్తుకి ఉపయోగించుకోవచ్చు కానీ వైసీపీ కోసం ప్రత్యేకంగా శాఖని, మంత్రిని ఏర్పాటు చేసుకోగలిగితే దానికి వేరే బాధ్యతలు అప్పగించకూడదు. 365 ఇదే పనిమీద ఉండాలి. కోర్టులో ప్రాసిక్యూషన్, డిఫెన్స్ లాయర్లు ఉన్నట్లుగానే, ప్రభుత్వాన్ని వైసీపీ నుంచి డిఫెండ్ చేయడానికి ఓ మంత్రిత్వ శాఖ అవసరమే.

ఇంత అత్యవసర పరిస్థితి ఏమొచ్చిందంటే, వైసీపీ దుష్ప్రచారం పరాకాష్టకు చేరింది కనుకనే. యూరియా విషయంలో సాక్షాత్ సిఎం చంద్రబాబు నాయుడు ఫేక్ వీడియో సృష్టించి సోషల్ మీడియాలో పెట్టింది!

దానిలో చంద్రబాబు నాయుడు అవసరానికి మించి యూరియా వాడుతున్న రైతులకు బుద్ధి లేదన్నట్లు, వారి వలన ప్రజల ఆరోగ్యాలు కూడా పాడవుతున్నయన్నట్లు ఉంది.

దీనిని టీడీపి ఖండించింది. అయితే వైసీపీ రోజుకో డజను ఫేక్ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తుంటే రోజూ వాటిని వెతికి పట్టుకోవడమే సిఎం చంద్రబాబు నాయుడి పనా?పోనీ మంత్రులు, ఎమ్మెల్యేలలైనా ఎంతకని కనిపెట్టగలరు?

ప్రతీరోజూ ఆ ఫేక్ వీడియోలు రాష్ట్రం నలుమూలలా సర్క్యులేట్ అవుతుంటే సామాన్య ప్రజలు వాటిని నమ్మకుండా ఉంటారా?నమ్మడం మొదలుపెడితే ఎవరికి నష్టం?

అందుకే అత్యవసరంగా కూటమి ప్రభుత్వంలో ‘దుష్ప్రచార ఖండన శాఖ’ దానికో ‘ఖండన మంత్రి’ని నియమించడం అవసరమే.

ఒకవేళ కుదరదనుకుంటే ఈవిదంగా దుష్ప్రచారం చేస్తున్నవారిని పట్టుకొని మీడియా సమక్షంలో వారు చేసిన దుష్ప్రచారం గురించి ప్రజలకు తెలియజేసి, దుష్ప్రచారం చేసినందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం చాలా అవసరం.

కాదని ఫేక్ వీడియోలను ఖండిస్తూ ఇలాగే కాలక్షేపం చేద్దామనుకుంటే, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదు.

ADVERTISEMENT
Latest Stories