jc-diwakar-reddy Foul Language

కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టుగా వైసీపీ పతనానికి కూడా బోలెడన్ని కారణాలే ఉన్నాయి. అందులో వైసీపీ మంత్రుల బూతుల పంచాయితీ ఒకటి. ఇందులో కూడా స్టేట్ టాప్ రాంక్ లో ఉంటారు మాజీ మంత్రి కొడాలి నాని.

ఈయన గారు గత ఐదేళ్లలో వాడిన భాష వైసీపీ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టింది. వయసుకి, హోదాకి కూడా గౌరవం ఇవ్వలేని ఈ కుసంస్కారి తన వేలుతో తనకన్నే పొడుచుకున్నట్టు తన భాషతో తన పార్టీనే సమాధి చేసుకున్నారు. అలాగే తన రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నారు.

Also Read – జగన్‌ లండన్‌లో.. బాబు దావోస్‌లో

అయితే కొడాలి మీడియా ముందుకొచ్చి తమ ప్రత్యర్థి నాయకుల మీద బూతులతో కూడిన వ్యక్తిగత విమర్శలు చేసినా వైసీపీ పార్టీ అధినేతగా కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ కొడాలి అరాచకాలకు అడ్డుకట్ట వేయలేకపోయారు జగన్. అసలు ఒక రకంగా చూస్తే వైస్ జగన్ మోహన్ రెడ్డే ఇటువంటి పిచ్చి ప్రేలాపనలు పేలే వారికి పదవులిచ్చి పోత్సహించే వారు.

అయితే వాటి ఫలితం ఎలా ఉంటుందో ఏపీ ప్రజలు వైసీపీ కి 11 సీట్లిచ్చి చెంపపెట్టు లాంటి జవాబిచ్చారు. అయితే ఈ బూతుల సంస్కృతీ ఏపీలో వైసీపీ ఫ్యాన్ రేకలు విరిచింది. అయినా కొంతమంది రాజకీయ నాయకులకు ఇంకా తత్త్వం బోధపడలేదనిపిస్తుంది. టీడీపీ సీనియర్ లీడర్ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూ టీడీపీ పార్టీకి గుదిబండలా మారిపోయారు.

Also Read – పునర్నిర్మాణం కోసం ఒకరు…విస్తరణ కోసం మరొకరు..!

తన బస్సులను ఎవరో బీజేపీ నేతలు తగలపెట్టారంటూ మీడియా ముందుకొచ్చిన ఈ పెద్దాయన తన చిన్న బుద్దిని బయట పెట్టుకున్నారు. కొడాలి నాని భాష మాదిరి బూతులతో రెచ్చిపోతూ ఆ పార్టీ మహిళా నేత మాధవి లత మీద కూడా తీవ్రమైన ఆరోపణలు చేసారు జేసీ. ఈ తరహా వ్యాఖ్యల పర్యవసానమే 151 నుంచి వైసీపీని 11 కి పడేసింది అనే సత్యాన్ని జేసీ గ్రహించలేకపోతున్నారా.?

ఇప్పుడు టీడీపీ నేతలు కూడా ఇదే తరహా భాష ప్రయోగిస్తూ రాజకీయ విమర్శలకు దిగితే రేపటి రోజున అది ఆయన, ఆయన కుటుంబం యొక్క వ్యక్తిగత రాజకీయానికే కాదు టీడీపీ పార్టీ భవిష్యత్ కు కూడా అడ్డంకిగా మారే అవకాశం లేకపోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా తాడిపత్రిలో ఈ పెద్దాయన చేస్తున్న పిచ్చి రాజకీయాన్ని టీడీపీ అధినేత బాబు కట్టడి చేసి తీరాలి.

Also Read – ఆ ఇద్దరు కూడా సంక్రాంతి హీరోలే..!

లేకుంటే అప్పుడు జగన్ మాదిరి ఇప్పుడు బాబు కూడా ఈ తరహా రాజకీయాన్ని ప్రోత్సహిస్తున్నారు, ఇటువంటి నేతలను వెనకేసుకొస్తున్నారు అనే అభిప్రాయం ప్రజలలో బలపడే ప్రమాదం ఉంది. తనకు తన వ్యాపారానికి ఏమైనా ఇబ్బందులు వచ్చినా, తనకు అన్యాయం జరిగేలా ఎవరైనా వ్యవహరించినా దాన్ని చట్ట పరంగా ఎదుర్కోవాలి లేకుంటే తన వాదనను, తన సమస్యలను ప్రభుత్వ పెద్దలకు నేరుగా విన్నవించుకోవాలి.




అంతే కానీ ఇలా మీడియా ముందుకొచ్చి మహిళా నేతల మీద నీచమైన విమర్శలు చేయడం, మరొకరిని అవమానించేలా బూతులతో కూడిన విమర్శలకు దిగడం ఆయన వయస్సుకు, ఆయన రాజకీయ అనుభవానికి తగదు. పార్టీలు కూడా ఇటువంటి వారిని ఆదిలోనే కట్టడి చేయకపోతే జగన్ మాదిరి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా అవుతుంది.