గత పాలకుల అవినీతికి మా ప్రభుత్వం చెక్ పెట్టబోతోంది, ఇందులో భాగంగానే మాజీ మంత్రి కేటీఆర్ ఈ ఫార్ములా కేసును తెరమీదకు తేవడం జరిగింది అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ కేసుల మీద తమ వైఖరిని, విధానాన్ని ప్రజలకు వివరించింది.
బిఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన కేటీఆర్ తనకున్న అధికారంతో క్విడ్ ప్రోకో విధానంతో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి ఆధారాలు చూపే పనిలో పడింది. ఇదిలా ఉంటే నేడు ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్, విచారణలో తనతో పాటు తన న్యాయవాదికి అనుమతి ఇవ్వాలని అధికారులను కోరగా అందుకు ఏసీబీ అధికారులు అంగీకరించలేదు.
దీనితో విచారణకు సహకరించాలి అంటూ కోర్ట్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా అధికారుల వద్దకు వెళ్లిన కేటీఆర్ వెళ్లిన పనిని పూర్తి చేయకుండానే వెనుతిరిగారు. దీనితో ఇప్పుడు కేటీఆర్ విచారణకు సహకరించినట్టా.? లేక సహకరించినట్ట అనే చర్చ మొదలయ్యింది. ఇదిలా ఉంటే ఇక రేవంత్ తన ఫార్ములా ప్రకారం ఈ కేసు తాలూకా బిఆర్ఎస్ అక్రమాలను మరికొన్నింటిని ప్రజల ముందుకు తెచ్చారు.
ఈ ఫార్ములా రేసును నిర్వహించిన గ్రీన్ కో సంస్థ నుంచి బిఆర్ఎస్ పార్టీకి భారీగా నిధుల మల్లింపు జరిగిందని, ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకి ఈ సంస్థ ద్వారా సుమారు 41 కోట్ల చెల్లింపు జరిగినట్లుగా వెల్లడించిన రేవంత్ సర్కార్, గ్రీన్ కో దాని అనుబంధ సంస్థలు దాదాపు 26 సార్లు ఈ బాండ్లను కొనుగోలుచేసినట్లు ఈ కేసు విషయై కీలక వ్యాఖ్యలు చేసింది రేవంత్ సర్కార్. దీనితో కేటీఆర్ పై రేవంత్ వేసిన ఈ ఫార్ములా కు కేటీఆర్ సొల్యూషన్ ఇచ్చి బయటపడగలరా.? లేక రేవంత్ ఫార్ములాలో చిక్కుకుంటారా.? అనేది పెద్ద చిక్కుముడే.




