బెట్టింగ్ రాజాలు…సిద్ధమా.?

cases-on-betting-app-owners

అనధికార ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ తో అనేకమంది జీవితాలను ఆర్థికంగా, మానసికంగా దెబ్బకొట్టిన ఈ బెట్టింగ్ యజమానులు మీద కూడా తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేసారు.

కొద్దిరోజుల క్రింతటా ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వెండితెర సూపర్ స్టార్స్, బుల్లితెర సెలబ్రేటిస్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్స్ మీద మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

ఇందులో భాగంగా నేడు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కూడా విచారణకు హాజరయ్యారు. అయితే వీరి విచారణతో ఇన్నాళ్లుగా తెర ముందు కనిపించిన ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ వెనుక ఉండే ఆ సూత్రదారులు, బెట్టింగ్ యాప్స్ యజమానులు బయటకు వస్తున్నారు.

తెలంగాణలోని మియాపూర్ లో 19 మంది బెట్టింగ్ యాప్స్ యజమానులు మీద కేసులు నమోదయినట్లు పోలీసులు అధికారికంగా ధ్రువీకరించారు. ఈ మేరకు కోర్టులో ఒక మెమో కూడా దాఖలు చేసారు మియాపూర్ పోలీస్ అధికారులు.

ఇప్పటి వరకు ఈ కేసులో విచారణకు హాజరైన సెలబ్రెటీస్, యు ట్యూబర్స్ ద్వారా సేకరించిన సమాచారంతో తెరవెనుక కథ నడిపించే ఆ బెట్టింగ్ యజమానులు కూడా ఇప్పుడు సమాజం ముందుకు రానున్నారు. ఇప్పటికి ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో సుమారు 25 మంది సెలబ్రేటిస్ మీద కేసులు నమోదయినట్టు సమాచారం.

తెలంగాణ ప్రభుత్వం మాదిరే ఇటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మాయాజాలం నుంచి అమాయకులను బలికాకుండా కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటే ఈ మహమ్మారి బారి నుండి అనేక కుటుంబాలకు ఆర్థికంగా లబ్ది చేకూర్చినట్లవుతుంది.

అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకుని బెట్టింగ్ యజమానులు పై, వాటిని ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటీల పై కఠిన చర్యలు తీసుకుంటే ఇక రానున్న రోజులలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు సెలబ్రెటీలు, వినియోగానికి సామాన్యుడు సైతం దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ విషయంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడే అవకాశం కూడా వస్తుంది.

ADVERTISEMENT
Latest Stories