ప్రముఖ మలయాళ సినీ నటుడు కళాభవన్ మణి మరణం అనుమానాస్పదంగా తేలిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసును విచారణను సీబీఐకు అప్పగించాలని కేరళ సర్కార్ నిర్ణయించింది. ఇందు నిమిత్తం కళాభవన్ మృతి వెనుక ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరుతూ, సీబీఐకి ఇవ్వాలని సిఫార్సు చేస్తూ సిబ్బంది వ్యవహారాల శాఖకు లేఖ రాసింది.
ADVERTISEMENT
కాగా, మణి మరణించి మూడు నెలలు గడుస్తున్నా, మృతి వెనకున్న కారణం తెలియకపోవడం, పోలీసులకు ఒక్క ఆధారమూ లభించకపోవడం, మృతదేహంలో రసాయనాలు ఉన్నాయని పోస్ట్ మార్టం నివేదిక వెల్లడి కావడంతో ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మణి మృతి వెనుక గుర్తు తెలియని వ్యక్తుల హస్తం ఉందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, సీబీఐ విచారణ నిజాన్ని తేలుస్తుందని భావిస్తున్నట్టు మణి సోదరుడు రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
ADVERTISEMENT



