వైసీపీ రాజకీయం తో ఏపీ నలిగిపోతుంది. ఒక పక్క రప్ప రప్ప నరుకుతాం అంటూ వైసీపీ క్యాడర్ రెచ్చిపోతుంటే, మరోపక్క వచ్చేది మేమే ఒక్కొక్కడు గుడ్డలూడతీస్తాం అంటూ అధినేత రెచ్చకొడుతుంటే, కేసులు పెట్టి అరెస్టులు చేస్తే తగ్గేదెలా అంటూ పార్టీ నాయకులు బరితెగిస్తున్నారు.
ఇవన్నీ చాలవు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రగతి పై కూడా వైసీపీ తన నీలి విషాన్ని చిమ్ముతూనే వస్తుంది. అందుకు గాను ఏపీడీఎంసీ బాండ్ల పై పెట్టుబడులు పెట్టొద్దు అంటూ వైసీపీ వివిధ కంపనీలకు దాదాపు 200 ఈ మెయిల్స్ పెట్టినట్టు ముఖ్యంమత్రి చంద్రబాబు దృష్టికి తెచ్చారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.
అయితే దీని మీద స్పందించిన సీఎం బాబు తక్షణమే వైసీపీ చర్యల మీద విచారణకు ఆదేశిస్తున్నటు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీసేలా వైసీపీ చేస్తున్న ఇటువంటి కుట్రల పై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వాటిని తిప్పికొట్టాలంటూ మంత్రులకు సూచనలు చేసారు బాబు.
అలాగే ఈ రోజు బాబు అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో మంత్రుల పని తీరు మీదకూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసారు. వైసీపీ నేతల విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రుల వ్యవహార శైలిని తప్పుబట్టారు.
టీడీపీ మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై వైసీపీ నేత ప్రసన్నకుమార్ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రుల స్పందన సరిగాలేదని, ఇటువంటి సమయంలో ఆమెకు ప్రభుత్వం నుండి పూర్తి మద్దతు అవసరమని తెలియచేసారు.
అయితే గతంలో కూడా వైసీపీ ఇదే మాదిరి అమరావతి నిర్మాణాలను అడ్డుకోవడానికి మంగళగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్కే ద్వారా కోర్టులో కేసులు వేపించి అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేసింది.
ఇక ఇప్పుడు పెట్టుబడులు పెట్టొద్దు అంటూ తన పార్టీ రాజకీయ లబ్ది కోసం రాష్ట్ర బ్రాండ్ వాల్యూ ని తగ్గించటానికి వైసీపీ వెనకాడడం లేదు. రాజకీయాన్ని రాజకీయంగా ఎదిరించలేక వ్యక్తిగత విమర్శలతో, ఇటువంటి వెన్నుపోటు రాజకీయాలతో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను వైసీపీ పాతాళానికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుంది.




