రాజకీయ నాయకుల నిర్ణయాలపై స్పందించడానికి సెలబ్రిటీలు పెద్దగా ఇష్టపడరు. ఏం చెప్తే ఏ వివాదం ఏ రూపంలో చుట్టుముడుతుందోనని భయపడడం, జాగ్రత్త పడడం చేస్తుంటారు. కానీ, కరెన్సీ నోట్లపై ప్రధాని తీసుకున్న నిర్ణయానికి మాత్రం సెలబ్రిటీలందరూ తమ స్పందనలను తెలియజేస్తున్నారు. దీనికి కారణం… మోడీ తీసుకున్నది రాజకీయ నిర్ణయం కాదు కాబట్టి..! దేశ భవిష్యత్తు కోసం, భావితరాల కోసం తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయం కాబట్టి! అయితే ఎవరెవరూ ఏం చెప్పారో గమనిస్తే…
హ్యాట్సాఫ్ నరేంద్ర మోడీ గారు…. ఇండియా మళ్ళీ పుట్టింది – రజనీకాంత్
‘మోడీ’ఫికేషన్ లో ఎత్తులు అంటూ కన్నీరు పెట్టుకున్న సింబల్ – అల్లు అర్జున్
ఛత్రపతి లాంటి మోడీ ఇంటర్వెల్ బ్యాంగ్ – దర్శకుడు సుధీర్ వర్మ
స్వచ్ఛ భారత్ కు నిజమైన అర్ధం – కొరటాల శివ
ప్రశాంతంగా ఉన్న వ్యక్తులలో నేను ఒకడ్ని… క్రిమినల్స్ ఏడుస్తున్న ఉన్న వేళ… తెల్ల ఇండియాను నేను ఆహ్వానిస్తున్నా – జగపతిబాబు
స్వచ్ఛభారత్ లక్ష్యం ఇదే, ఇండియా లోపల పరిశుభ్రం చేయడం – రామ్
బ్లాక్ మనీ దారుల, ఫేక్ కరెన్సీ దారుల ముఖాలు తెల్లబోయేలా చేసిన మోడీకి హ్యాట్సాఫ్ – రాంగోపాల్ వర్మ
పాత్ బ్రేకింగ్ నిర్ణయం – ఉపాసన (చెర్రీ సతీమణి)
ఇంకా చిన్న చితకా సెలబ్రిటీలు కూడా మోడీ నిర్ణయానికి అనుకూలంగా కామెంట్స్ చేస్తూ పోస్ట్ లు పెట్టారు. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పలువురు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. మరి దీని వెనుక ఉన్న మర్మమేమిటో గానీ, సోషల్ మీడియాలో మోడీ నామం మారుమ్రోగుతోంది.



