దేశ వ్యాప్తంగా కొన్ని జిల్లాలను ఎంపిక చేసుకుని మానవాభివృద్ది సూచిలో కూడా ముందుకు తీసుకు రావడానికి వీలుగా కేంద్రం ఒక పదకం ప్రవేశపెడుతుంది. ఇప్పటివరకు రాష్ట్రాలకు నిధులు ఇస్తుంటే పధకాల లక్ష్యం నెరవేరడం లేదని కేంద్ర కార్యదర్శులు వీటికి బాద్యత వహించి అభివృద్ది ఫలాలు ప్రజలకు లందేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
2022 నాటికి ఈ జిల్లాలు అన్ని విధాలుగా ముందుకు రావాలన్నది ఉద్దేశంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం, విశాఖపట్నం, కడప జిల్లాలను, తెలంగాణలో ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలను కేంద్రం ఇందుకు ఎంపిక చేసినట్టు సమాచారం.
తొందర్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఈ జిల్లాలకు ప్రత్యేక నిదులు కేటాయిస్తారు. అయితే ఈ పధకం వివాదాలకు దారి తీసే అవకాశం ఉంది. రాష్ట్రాల హక్కులను హరించే ప్రక్రియ ఇది అని చాలా మంది విమర్శిస్తున్నారు. ఇప్పటికే జిఎస్టీ ద్వారా రాష్ట్రాల ఆదాయం కేంద్రం పరిధిలోకి వెళ్లింది. ఇది మరో కొత్త ప్రక్రియా?



