క్రికెట్ లో ఐసీసీ ఈవెంట్ అంటే అభిమానులకు పండగ వాతావరణం వచ్చినట్టే. ఒకప్పుడు, ప్రతి 4 ఏళ్లకు ఒకే ఒక్క వరల్డ్ కప్ ఆడేవారు. కాలాంతరం, టి-20 వరల్డ్ కప్,ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్ట్ ట్రోఫీ అంటూ అనేకానేక ఈవెంట్స్ ను ప్రారంభించింది ఐసీసీ.అయితే అన్నిటిలో ఛాంపియన్స్ ట్రోఫీ కాస్త విభిన్నమైన ఈవెంట్ గా చెప్పవచ్చు.
50 ఓవర్ల వరల్డ్ కప్ అంటే వన్ డే ఫార్మాట్, టీ-20 వరల్డ్ కప్ అంటే పొట్టి ఫార్మాట్, టెస్ట్ ట్రోఫీ అంటే టెస్ట్ ఫార్మాట్ కు మాత్రమే పరిమితవుతాయి. అలాంటిది ఛాంపియన్స్ ట్రోఫీ కొన్ని సార్లు వన్ డే ఫార్మాట్ లో నూ, మరికొన్ని సార్లు టీ-20 ఫార్మాట్ లో నూ ఆడుతుంటారు. అయితే,చివరిగా 2017 లో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది.
అయితే, 2017 లో ఆ ట్రోఫీ ను ముద్ధాడిన పాకిస్తాన్ దేశం వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కు వేదికగా నిశ్చయించారు ఐసీసీ బోర్డు. మొదటి నుండే దీనికి బీసీసీఐ అంగీకరించదు అనే వార్తలు వచ్చినప్పటికీ, ఐసీసీ కు ఎదురు తిరగదని అనుకున్నారంతా. కానీ ఇంతలో బీసీసీఐ ట్రెషరర్, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కుమారుడు ‘జయ్ షా’ కు ఐసీసీ చైర్మన్ పదవి అందటం తో సీన్ అంతా రివర్స్ అయింది.
ఇండియా పాక్ కు వెళ్లి ఆడేందుకు ఒప్పుకోని భారత సర్కారు తీర్పు కు బదులుగా, బీసీసీఐ ఐసీసీ కు ఒక హైబ్రిడ్ మోడల్ సూచించింది.కేవలం భారత్ ఆడే మ్యాచ్లు దుబాయ్ వేదికగా పెట్టమని ఆ సారాంశం.తాజాగా, ఇందుకు పాక్ బోర్డు (పీ.సి.బీ) మరియు పాక్ సర్కారు నిరాకరించారు అనే సమాచారం వైరల్ అవుతోంది.
ఒకవేల హైబ్రిడ్ మోడల్ కు అంగీకరించినా, భారత్ మ్యాచ్లు ఉండవు కాబట్టి పాకిస్తాన్ దేశానికి అదే ఒక పెద్ద ఎదురుదెబ్బ. ఇక, వారు ఈ హైబ్రిడ్ మోడల్ కు నిరాకరించిన వేల, ఐసీసీ ఏకంగా వేదికనే మార్చే ఉద్దేశం లో ఉన్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే మైదానాల మరమత్తు కు భారీ ఎత్తున ఖర్చు చేసింది పాక్,ఇప్పుడు ఏకంగా వేదికనే మార్చేస్తే, వారికి ఆర్ధికంగా పెద్ద దెబ్బ ఏ తాకనుంది.
బీసీసీఐ ను కాదని ఐసీసీ ఏ నిర్ణయం తీసుకోలేదు. కారణం,మన భారత జట్టు లో ని ఆటగాళ్ల యొక్క బ్రాండ్ వాల్యూ.దీనికి తోడు, 2008 ఛాంపియన్స్ ట్రోఫీ కు కూడా ఇలానే పాక్ కు వచ్చేందుకు నిరాకరించిన బీసీసీఐ వలన వేదికను సౌత్ ఆఫ్రికా కు తరలించారు.మరల అదే జరుగుతుందని సమాచారం. దీనితో, హైబ్రిడ్ మోడల్ కు ఒప్పుకుంటే పాక్ కు ఎంతోకొంత మేలు, లేదంటే అంతా బూడిద లో పోసిన పన్నీరు లా మారుతుంది.
Champians trophy 2025




