వివేకా హత్య కేసునే ఏపీలో విచారణ చేయలేనప్పుడు….

Chandrababu_Naidu_VivekanadaReddy_CBIస్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో రెండువారాలుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని ఆ కేసు గురించి ప్రశ్నించేందుకు ఏసీబీ కోర్టు అనుమతించడంతో 15 మంది సీఐడీ అధికారులు అక్కడకు చేరుకొన్నారు.

ఏసీబీ కోర్టు చంద్రబాబు నాయుడుని ప్రశ్నించేందుకు ఏపీ సీఐడీని అనుమతించింది కానీ ఈ విచారణలో ఎంతమంది అధికారులు ఉండాలో చెప్పలేదు. కనుక చంద్రబాబు నాయుడుని ప్రశ్నించేందుకు ఏకంగా 15 మంది వచ్చారు.

ADVERTISEMENT

ఒకరిద్దరు అధికారులు ప్రశ్నలు అడిగితే వాటికి జవాబులు చెప్పగలరు. కానీ ఒకేసారి ఇంతమంది చుట్టుముట్టి ప్రశ్నిస్తే ఆయన తీవ్ర ఒత్తిడికి గురవడం ఖాయం. వైసీపి ప్రభుత్వం కోరుకొంటున్నది కూడా అదే కావచ్చు.

చంద్రబాబు నాయుడు నేరం చేశారని మంత్రులందరూ ముందే తీర్మానించేసి ఏపీ సీఐడీకి ముందే దిశానిర్దేశం చేశారు కనుక అధికారుల విచారణ కూడా అందుకు అనుగుణంగానే సాగుతుందని వేరే చెప్పక్కరలేదు. అంటే ఈ కేసులో ముందే తీర్పు సిద్దం చేసుకొని చంద్రబాబు నాయుడుని దోషి అని నిరూపించేందుకు విచారణ జరుపుతున్నట్లు భావించవచ్చు.

సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసును ఏపీ సీఐడీ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా చేయడం లేదనే సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. కానీ సీబీఐ కూడా ఆంద్రాలో ఈ కేసును పారదర్శకంగా, నిష్పక్షపాతంగా చేయలేకపోతోందని భావించిన సునీతారెడ్డి, సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఆ కేసును తెలంగాణకు బదిలీ చేయించుకొన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ అక్కడ కూడా ఆ కేసు ఒక్క అడుగు ముందుకు సాగలేకపోతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

పొరుగు రాష్ట్రంలోనే కేసును కదలనీయకుండా కట్టిపడేస్తున్నప్పుడు ఇక ఏపీలో చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలపై నమోదు చేస్తున్న కేసుల విచారణ జరిగితే వారికి న్యాయం జరుగుతుందని ఆశించడం కష్టం.

ADVERTISEMENT
Latest Stories