ఏపీ రాజకీయాలు చంద్రబాబు అరెస్ట్ చుట్టు, చంద్రబాబు కేసు కోర్టుల చుట్టూ తిరగడం పరిపాటిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కేసుల మీద కేసులు వేసుకుంటూ పోతుంటే న్యాయస్థానాలు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు. సుప్రీం కోర్టులో చంద్రబాబు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు ధర్మాసనంలో న్యాయమూర్తి ఎస్వీఎన్ భట్టి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో మరో బెంచ్ కు బాబు పిటిషన్ బదిలీ చేశారు.
చంద్రబాబు తరుపు న్యాయవాదులు వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సిజెఐ ధర్మాసనం ఇరు పార్టీల వాదనలు విని కేసుని ఆక్టోబర్3కి ఆకేసును వాయిదా వేసింది. చంద్రబాబు కేసు పిటిషన్ విచారణకు రాగానే ఏదోఒక కారణంతో వాయిదాలు – బదిలీలు జరగడం యాదృచ్ఛికమా? లేక మరేదైనా? అనే సందేహం అటు తెలుగుదేశం శ్రేణులకే కాదు సామాన్య ప్రజలకు సైతం అంతుపట్టని రహస్యంగా మిగిలింది.
హత్యలు చేసిన వైసీపీ నాయకులు సైతం రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కానీ రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన వ్యక్తిని జైలుకు పంపిన జగన్ ప్రభుత్వం తాలూకా నిరంకుశత్వం తేటతెల్లమవుతుంది. ఈ అరెస్టుల పర్వం ఇక్కడితోనే మొదలు అంటూ ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే సెలవిచ్చారు. ఢిల్లీ నుంచి రాగానే లోకేష్ అరెస్టుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు ఇప్పటికే రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతుంది. అక్కడితో ఆగక చంద్రబాబు కుటుంబ సభ్యుల పై కూడా విచారణ ఉంటుందంటూ పలువురు వైసీపీ నేతలు తాజాగా చేసిన ప్రకటనలుదేనికి సంకేతమో?



