ఒకరిది శపథం..మరొకరిది పంతం..ఇంకొకరిది పట్టుదల.!

chandrababu-naidu-pawan-kalyan-and-nara-lokesh

ఈ 2024 కొన్ని చారిత్రాత్మకమైన తీర్పులకు వేదికగా నిలిచింది. 2019 ఎన్నికల తరువాత టీడీపీ ఓటమి పట్ల చంద్రబాబు తో వైసీపీ నడుచుకున్న విధానం ఆ పార్టీలోని మంత్రులు, నాయకులు ఒక మాజీ ముఖ్యమంత్రి అనే కనీస గౌరవం ఇవ్వకుండా, సంస్కారాన్ని మరిచి చేసిన వ్యాఖ్యలు బాబు రాజకీయ జీవితంలోనే చీకటి రోజులుగా చెప్పవచ్చు.

టీడీపీ పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి బాబుని మానసికంగా వేధించింది జగన్ అండ్ కో. అతనినే కాక రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని ఆయన భార్య భువనేశ్వరి ని కూడా రాజకీయ వేదికల మీదకు లాక్కొచ్చి మరి అసెంబ్లీ సాక్షిగా అవమానించి ఆనందించారు వైసీపీ నేతలు.

ADVERTISEMENT

అయితే ఆనాడు తనకు తన కుటుంబానికి అసెంబ్లీ లో జరిగిన ఘోర అవమానానికి గాను కళ్ళు చమర్చిన చంద్రబాబు ఈ కౌరవ సభను గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రి గానే తిరిగి ఇక్కడ అడుగు పెడతాను అంటూ ‘శపథం’ చేసి చట్ట సభల నుంచి ప్రజా క్షేత్రానికి వచ్చారు. అయితే ఆ చట్టాన్ని కూడా తమ చుట్టంగా మార్చుకున్న వైసీపీ బాబుని అరెస్టు చేసి సుమారు 60 రోజుల పాటు జైలులో నిర్బంధించగలిగారు.

అలా నాడు అవమాన భారంతో బాబు చేసిన శపథం నేడు 164 సీట్ల అఖండ మెజారిటీతో నెరవేర్చుకుని ముఖ్యమంత్రిగా గౌరవ సభలో అడుగుపెట్టారు చంద్రబాబు. ఇక పార్టీ పెట్టి పదేళ్లు గడిచింది, పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి ఎదురయ్యింది, ఇటువంటి వారు రాజకీయాలకు పనికి రారు అంటూ వైసీపీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిపోయింది.

ప్యాకేజీలు తీసుకుంటూ, భార్యలను మారుస్తూ, స్థిమితం లేని రాజకీయం చేస్తూ చివరికి బాబు పల్లకి మోసే ఒక దత్త పుత్రుడిగా మిగిలిపోతావు అంటూ వైసీపీ చేసిన అవమానాలకు, అవహేళనలకు బదులు చెప్పే రోజు కోసం వైసీపీ లేని ఆంధ్రప్రదేశ్ అంటూ ‘పట్టుదల’తో పని చేసిన పవన్ మూడు పార్టీల పొత్తులతో 100 % స్ట్రైక్ రేట్ తో జనసేనను గెలిపించుకుని వైసీపీ మీద పైచెయ్యి సాధించారు.

హలో ఏపీ బై బై వైసీపీ అనే నినాదాన్ని నెరవేర్చుకున్నారు. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా, ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడిగా, టీడీపీ పార్టీ భవిష్యత్ నేతగా ఉన్న నువ్వు కూడా మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరవేయలేకపోయావ్ అంటూ ఎద్దేవా చేసిన వైసీపీ నేతల విమర్శలకు మంగళగిరిని టీడీపీ కంచుకోటగా మార్చి తీరుతా అంటూ ‘పంతం’ పట్టిన లోకేష్ ఆ దిశగా ఐదేళ్లు మంగళగిరిలో అలుపెరుగని యుద్ధం చేసారు.

ఓడిపోయావు అన్న అవమానాలు ఒక వైపు, తండ్రిని అవహేళన చేస్తున్నారు అనే ఆవేదన మరో వైపు, తల్లిని కించపరుస్తున్నారే అన్న ఆందోళన మరో వైపు పెట్టుకుని కూడా కొన్ని దశాబ్దాలుగా సాధ్యం కానీ ఒక కార్యాన్ని పూర్తి చేయడానికి నడుం బిగించిన నారా లోకేష్ 2024 ఎన్నికలలో తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మీద దాదాపు 90 వేళ ఓట్ల మెజారిటీతో గెలిచి మంగళగిరిని టీడీపీ కంచుకోటగా మార్చి పట్టిన పంతం నెరవేర్చుకున్నారు.

ఇలా ఈ ముగ్గురు నేతలు కూడా 151 సీట్లతో ఉన్మాదంతో కొమ్ములు తిరిగిన వైసీపీ అహంను 11 కు అణిచి తమకు, తమ కుటుంబాలకే కాదు రాజధాని లేదు అంటూ రాష్ట్రానికి జరిగిన అవమానాలకు, అవహేళనకు, ఈసడింపులకు 2024 లో 164 సీట్ల భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గట్టి సమాధానం చెప్పారు.

ADVERTISEMENT
Latest Stories