కరువు కాటకాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. గత రెండేళ్ళుగా ఉన్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులలో పెద్దగా మార్పులు సంభవించలేదు. దీనికి కారణం కేంద్రంలో ఉన్న బిజెపి ‘నమ్మక ద్రోహమని’ అక్కడ ఇక్కడ తెలుగుదేశం నేతలు చేస్తున్న వ్యాఖ్యలు. తోడుగా ఉంటాం… అండగా ఉంటాం… రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో తీసుకెళ్తాం… అంటూ ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలకు… ప్రస్తుతం పరిశీలిస్తున్నాం… చేసేసాం… ఇక ఇవ్వబోం… అంటూ సమాధానం ఇస్తున్నారు. ఆ విధంగా చెంత ఉంటూనే బిజెపి పీక కోసే ప్రయత్నాలు చేస్తోందని ‘ప్రత్యేక హోదా సాధన సమితి’కి చెందిన శివాజీ, చలసాని వంటి వారు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
అసలు బిజెపికి… ఆ అవకాశం ఎలా వచ్చింది అంటే… సీన్ కట్ చేసి కాంగ్రెస్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. స్వార్ధ రాజకీయ లబ్ది కోసం తెలుగు ప్రజలను రెండు రాష్ట్రాలుగా విభజించిన ఘనత కాంగ్రెస్ సొంతం చేసుకుంది. అయితే తెలంగాణాకు మిగులు బడ్జెట్ వచ్చేలా బిల్లు రూపకల్పన చేసిన కాంగ్రెస్ పెద్దలు ఏపీకి మాత్రం ‘చిప్ప చేతికి ఇచ్చి అడుక్కోమన్నట్లుగా’ నడిరోడ్డుపై వదిలేసారు. అదే కాంగ్రెస్ నేతలు నేడు మాత్రం… కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నీతి సూక్తులు చెప్తూ కాలం గడుపుతున్నారు.
ఇంత కష్టకాలంలో ఉన్నా కూడా… రాష్ట్ర ప్రజలకు కనిపించిన ఒకే ఒక్క ఆశ… హైదరాబాద్ ను అంతర్జాతీయ పటంలో పెట్టిన ‘చంద్రబాబు’ అన్న పేరు! అనుకున్న ప్రకారమే గెలిపించారు. గత రెండు సంవత్సరాలుగా తన శక్తి వంచన లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్న ఏకైక నాయకుడు చంద్రబాబు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రెండంకెల వృద్ధి రేటుకు తోడు, విద్యుత్ సరఫరా వంటి విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుని ఎంతో కొంత రాష్ట్రాన్ని ప్రగతి బాటలో పెడుతున్న చంద్రబాబుకు అడ్డుతగులుతున్న ఏకైక ‘పదం’ జగన్ మోహన్ రెడ్డి.
అవును… ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చెప్పారు. ఒక్క రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే జగన్ ను భరిస్తున్నానంటూ తన ఆవేదనను వెళ్లగక్కారు. తన రాజకీయ అనుభవమంత వయసు లేని జగన్ లాంటి వ్యక్తిని ఇంతవరకు తానూ చూడలేదని విస్మయాన్ని వ్యక్తపరిచారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సహా ఎంతో మంది రాజకీయ నాయకులను చూసాను… కానీ, వారి ఎవ్వరి వల్ల ఎదురుకాని సమస్యలు ఒక్క జగన్ వలన తానూ ఎదుర్కొంటున్నట్లు స్వయంగా ఒక ముఖ్యమంత్రే బహిరంగంగా వ్యాఖ్యానించారంటే… జగన్ ఏ విధంగా ప్రగతికి అడ్డు పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.
మరి జగన్ నేడు రాజకీయాల్లో ఉండడానికి కారణం… వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 2011లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఎన్నికలకు వెళ్ళిన సమయంలో ఎంపీగా పోటీ చేసిన జగన్ రాజకీయ తెరంగ్రేటం చేసారు. ఆ విధంగా జగన్ రాజకీయాల్లోకి రావడానికి కారణమైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత మరణించి జగన్ ను ఒక ‘యువనేత’గా ఆవిర్భావం కావడానికి కారణమయ్యారు. అందుకనే… ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్, బిజెపిలు చేసిన ద్రోహలతో పోలిస్తే… జగన్ రూపేణా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన ద్రోహమే ఎక్కువని పరిశీలకులు భావిస్తున్నారు.



