chandrababu-naidu-revanth-reddy-davos

ఈ నెల 20 నుంచి ఐదు రోజులపాటు దావోస్‌ ప్రపంచదేశాల ఆర్ధిక సదస్సు జరుగబోతోంది. దీనిలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌‌ నుంచి సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్‌, టీజీ భరత్, సీనియర్ అధికారుల బృందం శనివారం రాత్రి బయలుదేరుతున్నారు.

Also Read – రఘురామని కూడా బాబు కాపాడుకున్నారు.. మరి వంశీని?

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి బృందం కూడా గురువారం రాత్రి ఢిల్లీ నుంచి సింగపూర్ బయలుదేరింది. అక్కడి ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలతో రెండు రోజులు వరుస భేటీల తర్వాత వారు కూడా దావోస్ సదస్సుకి చేరుకుంటారు.

దావోస్ సదస్సులో భారత్‌తో సహా 18 దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, ఐటి కంపెనీల సీఈవోలు, వారి ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. వారితో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, మంత్రులు భేటీ అయ్యేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Also Read – తెలంగాణ సింహం బయటకు వస్తోంది మరి ఏపీ సింహం?

ఏపీకి ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా, పర్యాటకం, ఐటి, ఫార్మా, ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి అనుబంద పరిశ్రమలు, సోలార్, విండ్ పవర్ ప్లాంట్స్ వగైరా రంగాలలో పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకొని అందుకు అనుగుణంగా విదేశీ ప్రతినిధులతో భేటీలకు ఏర్పాట్లు చేసుకున్నారు.

రేవంత్ రెడ్డి బృందం కూడా తెలంగాణ రాష్ట్రానికి ఈ రంగాలలోనే పెట్టుబడులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని వస్తున్నారు. కనుక దావోస్ సదస్సులో కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య పెట్టుబడుల కోసం పోటీ తప్పదన్న మాట!

Also Read – అమ్మకు ప్రేమతో ఒకరు….అమ్మ మీద ద్వేషంతో మరొకరు…

తెలంగాణకి సానుకూలతలు: అన్ని విదాల అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ నగరం కలిగి ఉంది. కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల మద్య రాజకీయాలు ఏవిదంగా ఉన్నప్పటికీ, సిఎం రేవంత్ రెడ్డి అవి పరిశ్రమలు, పెట్టుబడులకి అవరోధంగా మారనీయలేదు. రాజకీయాలకు అతీతంగా ఐటి కంపెనీలకు, పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలబడుతోంది. పైగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థిరంగా నిలదొక్కుకుంది కూడా. కనుక హైదరాబాద్‌కి పెట్టుబడులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.

ఇక ఏపీలో జగన్‌ 5 ఏళ్ళ అరాచక పాలన చూసినవారు ఏపీలో పరిశ్రమలు స్థాపించేందుకు భయపడటం సహజమే. కానీ పరిశ్రమలు, ఐటి కంపెనీల విషయంలో చంద్రబాబు నాయుడుకి ఉన్న మంచి ఇమేజ్, వారితో ఉన్న పూర్వ పరిచయాలు, ముఖ్యంగా కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తుండటం వంటివన్నీ ఏపీకి సానుకూల అంశాలు.




దావోస్ సదస్సుకు ముందే అమరావతి నిర్మాణపనులు మొదలుపెడుతుండటం ద్వారా సానుకూల సంకేతాలు వెళ్ళాయి. ఆదేవిదంగా రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులతో అనేక పరిశ్రమలకు ప్రధాని మోడీ స్వయంగా శ్రీకారం చుట్టడం, కేంద్ర ప్రభుత్వం సాయంతో రాష్ట్రంలో కొత్తగా విమానాశ్రయాలు, పోర్టులు నిర్మాణాలు జరుగుతుండటం, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన పనులు జరుగుతుండటం వంటివన్నీ ఏపీలో పరిశ్రమలు, ఐటి కంపెనీల స్థాపనకు చక్కటి అనుకూలమైన వాతావరణం ఉందని చాటిచెపుతున్నాయి. కనుక సిఎం చంద్రబాబు నాయుడు బృందం ఏపీకి తప్పకుండా భారీగా పెట్టుబడులు ఆకర్షించగలరు.