బాబు భద్రత గాల్లో దీపమే… రిమాండ్‌ ఖైదీ మృతి ఓ నిదర్శనం

Chandrababu Naiduధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ అనే యువకుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. అతను రక్తపు వాంతులు, విరేచనాలు, తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో జైలు సిబ్బంది అతనిని ఈ నెల 19 అర్దరాత్రి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు. అతను డెంగీతో చనిపోయిన్నట్లు వైద్యులు ధృవీకరించారు.

అదే జైలులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఉన్నందున డెంగీ బారిన పడి అతను మృతి చెందడంతో టిడిపి నేతలు అప్రమత్తమయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ ఘటనపై స్పందిస్తూ, “జెడ్ ప్లస్ భద్రత కలిగిన చంద్రబాబు నాయుడుగారిని ఎటువంటి భద్రతాలేని రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బందించి అక్కడే అంతమొందించేందుకు ఈ జగన్‌ ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్లు మాకు అనుమానం కలుగుతోంది.

ADVERTISEMENT

అదే జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగీతో మృతి చెందాడు. జైల్లో దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదు. కనుక బాబుగారిని కూడా ఇలాగే ఎవరికీ అనుమానం కలుగకుండా జైల్లోనేఅంతమొందించాలని ఈ జగన్‌ ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్లు అనుమానం కలుగుతోంది. కనుక చంద్రబాబు నాయుడు భద్రతకు ఆయనే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది,” అని అన్నారు.

డెంగీతో చనిపోయిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ వయసు కేవలం 19 సంవత్సరాలే. కనుక సహజంగానే అతనికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు వయసు 73 సంవత్సరాలు. కనుక రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. జైల్లో ఏమాత్రం తేడా చేసినా తీవ్ర అనారోగ్యం పాలైతే కోలుకోవడం చాలా కష్టమవుతుంది. ఇంతకాలం చంద్రబాబు నాయుడుని జైలుకి పంపించడం, వీలైనంత ఎక్కువ కాలం జైల్లోనే ఉండేలా చేయడమే వైసీపి ప్రభుత్వం లక్ష్యమని టిడిపి నేతలు వాదిస్తున్నారు. కానీ రిమాండ్‌ ఖైదీ మృతితో నారా లోకేశ్‌ ఆందోళన, చేస్తున్న ఆరోపణలు సహేతుకంగానే ఉన్నట్లు అర్దమవుతోంది.

ADVERTISEMENT
Latest Stories