
హత్యలు, అత్యాచారాలు, కిడ్నాపులు ఏ రాష్ట్రంలో జరిగినా ఆ రాష్ట్రానికి, ప్రభుత్వానికి తీరని అప్రదిష్ట కలిగించేవే. అందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జగన్ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం కూడా మినహాయింపు కానే కావు.
Also Read – బెట్టింగ్ యాప్స్: డబ్బు మాకు.. బాధ్యత సమాజానీదీనట!
వైఎస్సార్ జిల్లా బద్వేలులో ఓ ప్రేమోన్మాది ఇంటర్ విద్యార్ధినిని ప్రేమ పేరుతో వేధించి, ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసింది.
గతంలో జగన్ హయాంలో ఇటువంటి హేయమైన నేరాలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడుతో సహా టిడిపి, జనసేన నేతలు తీవ్రంగా ఖండిస్తూ, ప్రభుత్వాన్ని నిలదీసేవారు. ఇప్పుడు జగన్, వైసీపి నేతలు టిడిపి కూటమి ప్రభుత్వాన్ని అదేవిదంగా నిలదీస్తున్నారు.
Also Read – వైసీపీ ఇప్పుడే ధర్నాలు చేసుకుంటే మంచిదేమో?
ఈ ఘటన జరిగిన వెంటనే జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో 4 బృందాలు గాలింపు మొదలుపెట్టి ప్రధాన నిందితుడు విగ్నేష్‌ని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలినవారి కోసం ఇంకా గాలిస్తున్నారు.
ఈ విషాద ఘటనపై సిఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, “ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న ఆ బాలిక ఈవిదంగా ఓ దుర్మార్గుడి చేతిలో ప్రాణాలు కోల్పోవడం నన్ను చాలా కలిచివేసింది. ఆమె కుటుంబానికి న్యాయం చేయడం ఎంత ముఖ్యమో ఇటువంటి దారుణానికి పాల్పడిన వ్యక్తికి మరణశిక్ష పడేలా చేయడం కూడా అంతే ముఖ్యం.
Also Read – అందరికీ సారీ.. అదిదా సర్‌ప్రీజు!
కనుక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఈ కేసు విచారణని వేగంగా పూర్తి చేసి హంతకుడికి శిక్ష పడేలా చేయాలని అధికారులను ఆదేశించాను. తద్వారా రాష్ట్రంలో ఇటువంటి హేయమైన నేరం చేయడానికి భయపడాలి. ఇటువంటి నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖకి అవసరమైనవన్నీ అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి మారుపేరుగా నిలవాలి తప్ప ఇటువంటి హేయమైన నేరాలతో అప్రదిష్ట రాకూడదని కోరుకుంటున్నాను,” అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
జగన్, వైసీపి మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, వారి సోషల్ మీడియా ఈ ఘటన టిడిపి కూటమి ప్రభుత్వ వైఫల్యంగానే అభివర్ణిస్తూ, సిఎం చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనితా వంగలపూడి, డిజిపి ద్వారకా తిరుమల రావుని విమర్శిస్తున్నారు.
గతంలో ఇటువంటి ఘటనలు, నేరాలు జరిగినప్పుడు టిడిపి, జనసేనలు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించేవి. కనుక ఇప్పుడు వైసీపిని తప్పు పట్టలేము. కానీ వారికి ఆ అవకాశం కలుగకుండా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని మరింత కట్టుదిట్టం చేయాల్సి ఉంది.