అవే ఊకదంపుడు ఉపన్యాసాలు ఉత్తరంలో రాసి పంపుతారా?

Chandrababu Naidu-AP Special Statusటీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీయే నుండి బయటకు వచ్చేటప్పుడు ఒక విమర్శనాస్త్రం సంధించారు. బీజేపీ దానికి కౌంటర్‌ సిద్ధం చేసింది. షా రేపు ఆ లేఖను విడుదల చేసే అవకాశం ఉంది. చంద్రబాబు చేసిన ప్రతి ఆరోపణకు లేఖలో సమాధానం ఇస్తూ మిత్ర ధర్మాన్ని టీడీపీ ఎలా విస్మరించిందో… బీజేపీని ఎలా ద్రోహం చేసిందో ఆ లేఖలో అమిత్‌ షా ప్రస్తావించనున్నారు.

ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం చేసిన సాయం, భవిష్యత్‌లో చేయబోయే సాయాన్ని ఆ లేఖలో వివరించనున్నారు. అలాగే ప‍్రత్యేక హోదాపై చంద్రబాబు వైఖరి…మాట మార్చిన తీరును అమిత్‌ షా ఎండగట్టనున్నారట. అయితే ఇప్పటిదాకా పార్లమెంట్ సాక్షిగానే అనేక అబద్దాలు చెప్పి ఇవ్వని నిధులు ఇచ్చామని, ప్రైవేట్ ప్రాజెక్టులను కూడా తామే ఇచ్చాము అని చెప్పుకుతిరుగుతున్నారు బీజేపీ వారు.

ADVERTISEMENT

ఏకంగా 2-3 లక్షల కోట్లు ఇచ్చేశాం అని డబ్బా కొట్టుకుంటున్నారు. వాస్తవానికి రాష్ట్రానికి ఏమీ చెయ్యకపోయినా. ఇప్పుడు అవే ఊకదంపుడు ఉపన్యాసాలను ఉత్తరంలో ఇరికించి రాసి పంపుతారు. అయితే వీటిని నమ్మే అంత అమాయకులు మన రాష్ట్రప్రజలు కాదని ఇప్పటికే చాలా సార్లు నిరూపించారు.

ADVERTISEMENT
Latest Stories