తిరుపతి నుండి అమరావతి వరకు అనితరసాధ్యం ఆయన ప్రస్థానం

Chandrababu Naidu the best Chief minister of Andhra Pradeshఒడిదొడుకులు, స‌వాళ్లూ, సంక్షోభాలు మూడు ముక్కల్లో ఆయన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం. అయితే చరిత్ర ఆయన గురించి చెప్పేది మాత్రం పట్టుదల, అకుంఠిత దీక్ష, మొక్కవోని ఆత్మవిశ్వాసం, 24 గంటలు కష్టపడే తత్వం, అద్భుత విజయాలు. ఆయనే తెలుగు దేశం పార్టీ రధసారధి, తెలుగు వారి బెస్ట్ సీఎం, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

చాలా మంది నాయకులకు అయితే రాజకీయంగానో లేక పాలనా పలంగానో ఇబ్బందులు ఉండొచ్చు. అయితే చంద్రబాబు ప్రస్థానంలో రెండు సమపాళ్లలో ఉంటాయి. 1978.. చంద్ర‌గిరి నియోజ‌క వ‌ర్గం నుంచి ఆయ‌న తొలిసారిగా శాస‌నస‌భ్యుడిగా పోటీ చేసి అతి పిన్న వయసులో బలమైన ప్రత్యర్థిపై విజయం సాధించారు.

ADVERTISEMENT

1980లో అంజయ్య క్యాబినెట్ లో మంత్రి అయ్యారు. తరువాత ఎన్ఠీఆర్ టీడీపీలో జాయిన్ అయ్యి ఒక సామాన్య కార్యకర్తలా శ్రమించి పార్టీ టిక్కెట్ తెచ్చుకుని గెలిచి తరువాత మంత్రి అయ్యారు. ఎన్ఠీఆర్ అల్లుడిగా కాకుండా ఆయన స్వశక్తి మీద మంత్రి అయ్యారు. అంతకు ముందు నాదెండ్ల భాస్కర్ రావు తిరుగుబాటును తిప్పికొట్టడంలో కూడా ఆయన కీలక భూమిక పోషించారు.

సొంత మామ మీద తిరుగుబాటు చెయ్యాల్సి రావడం చంద్రబాబు రాజకీయ జీవితంలో కీలకం. అంతటి ప్రజాకర్షక నేతను దించిన ప్రజలు ఆయన వైపు ఉండడం చంద్రబాబు గొప్పతనం. కాంగ్రెస్ విధానాల వల్ల ఖాళీ అయిన ఖజానాను దారిలో పెట్టడానికి ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. అయితే ఆయన కాలంలో హైదరాబాద్ కు తద్వారా ఆంధ్రప్రదేశ్ ఐటీకు స్వర్ణయుగం అనడం అతిశయోక్తి కాదు.

అయితే 2004లో వైఎస్సార్ ఆయనను గద్దె దించారు. ఒకటి కాదు ఏకంగా రెండు పర్యాయాలు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. వైఎస్సాఆర్ మృతి అనంతరం రాష్ట్ర విభజన సమస్య వచ్చిన రెండు రాష్ట్రాలలో పార్టీని నిలుపుకున్నారు. 2014లో ఓటమి ఖాయం అని భావించిన పట్టుదల వదలక మహా పాదయాత్రతో పార్టీని నవ్యంధ్రలో అధికారంలోకి తెచ్చారు.

రాజ‌ధాని లేదు, ముఖ్య‌మంత్రి కార్యాల‌యం లేదు, నిధుల్లేవు, ఆదాయం లేదు, అయినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ప్రయాణం మొదలు పెట్టారు. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న తరుణంలో మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. చంద్రబాబు కొత్త సవాల్ కు సిద్ధం అవుతున్నారు. ఫలితం తెలుగు దేశం పార్టీ కంటే రాష్ట్రానికి చాలా అవసరం.

ADVERTISEMENT
Latest Stories