రేవంత్ రెడ్డి పై అంతిమ తీర్పు అమరావతిలో

Chandrabbu naidu to decide on revanth reddy in amaravatiవిదేశీ పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వ్యవహారం తేల్చడానికి తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం అయ్యారు. రేవంత్‌తో పాటు ఎల్‌.రమణ పరస్పరం అధ్యక్షుడికి ఫిర్యాదు చేసుకున్నట్లు సమాచారం. సమావేశంలో రేవంత్ నోరు మేడపలేదు.

ADVERTISEMENT

తరువాత చంద్రబాబుతో రేవంత్‌ రెడ్డి ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను వివరించినట్లు తెలుస్తోంది. ఐతే రేవంత్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు చంద్రబాబు. టీటీడీపీ ముఖ్య నేతలు రేపు అమరావతి రావాల్సిందిగా చంద్రబాబు సూచించారు.

రేవంత్ రెడ్డి విషయంలో ఎవరూ తొందరపడి మాట్లాడొద్దని, సంయమనం పాటించాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. రేవంత్ కూడా రేపు అమరావతి వెళ్లే అవకాశం ఉంది. అక్కడే ఆయన మీద చంద్రబాబు తన నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు తెలిసింది.

ADVERTISEMENT
Latest Stories