ఐదేళ్లు చేతిలో అధికారం పెట్టుకుని కేవలం ఉచిత పథకాల బటన్లు నొక్కడమే ప్రభుత్వం అన్నట్టుగా పాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఇప్పుడు అసలుసిసలైన ప్రభుత్వ పాలన అంటే ఎలా ఉంటుందో కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేసి చూపిస్తుందనే చెప్పాలి.
ఒక పక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, మరోపక్క పారిశ్రామిక ప్రగతితో సంపద సృష్టి చేస్తూ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాలు మొదలు రాష్ట్రంలో ప్రజల దశాబ్దాల కలలుగా మిగిలిపోయిన పోలవరం, వెలికొండ ప్రోజెక్టుల పూర్తికి నడుం బిగించారు.
అందులో భాగంగానే నేడు ప్రకాశం జిల్లా రైతుల సాగు నీటి కష్టాలు, అక్కడి ప్రజల తాగు నీటి ఇబ్బందులను తొలగించేందుకు గాను ‘పూల సుబ్బయ్య వెలికొండ ప్రాజెక్ట్’ మొదటి దశ పనులు పూర్తి చేసుకుని ఆ ప్రాజెక్ట్ ను సీఎం చంద్రబాబు నాయుడు తన చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి నారాలోకేష్ మార్కాపురం జిల్లా ప్రజలకు వెలికొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ శుభాకంక్షలు తెలియచేసారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ జిలాల్లో ప్రజల వలసలు ఆగుతాయని, రైతులకు అవసరమైన సాగు నీరు అందుబాటులోకి వస్తుందని, ఎన్నో దశాబ్దాలుగా ఆ ప్రాంత ప్రజలను పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు ఒక చక్కటి పరిష్కారం లభిస్తుందంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
1996 లో అప్పటి ఉమ్మడి అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన జరుపుకున్న వెలికొండ ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన పుష్కర కాలం తరువాత తిరిగి ఆయన చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరుపుకోవడం, జాతికి అంకితం ఇవ్వడం బాబు రాజకీయ డిక్షనరీ లో మరో కీలక ఘట్టమనే చెప్పాలి.
తాజాగా భోగాపురం ఎయిర్ ఫోర్ట్ విషయంలో కూడా ఈ ప్రాజెక్ట్ కు నాడు కొబ్బరికాయ కొట్టింది నేడు గుమ్మడి కాయ కట్టింది కూడా తానే అంటూ బాబు చాల గర్వంగా చెప్పుకున్నారు. అలాగే చిత్తూరు జిల్లా అభివృద్ధిలో భాగంగా శ్రీ సిటీ నిర్మాణం ఏపీలో పారిశ్రామిక ప్రగతికి చక్కటి అవకాశంగా మారింది.
ఇక దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా తనదైన ముద్ర వేసిన హైదరాబాద్ కి హై టెక్ సిటీ నిర్మాణంతో, సైబరాబాద్ అభివృద్ధితో అంతటి బ్రాండ్ వాల్యూ ను తెచ్చింది కూడా చంద్రబాబే కావడం ఆయనకు రాజకీయలలో ఒక మంచి ‘విజనరీ’ నేతగా గుర్తింపు సంపాదించి పెట్టింది.
ఇక సంక్షేమం విషయంలో మహిళలకు – డ్వాక్రా, పిల్లలకు – అంగన్వాడీ, పేదలకు – అన్నా క్యాంటిన్లు, కార్మికులకు – చంద్రన్న భీమా, గ్రామాలకు – జన్మభూమి, ప్రజలకు – మీ సేవ, పచ్చదనానికి – నీరు, చెట్టు…ఇలా ఒక నాయకుడి విజనరీ అంటే కేవలం భవనాలు, రోడ్లు, అభివృద్ధి పనులు మాత్రమే కాదని ప్రజల జీవన విధానాన్ని మార్చే వ్యవస్థలు అని చేసి చూపిస్తున్నారు సీఎం CBN.
ఇలా ఏడూ పదుల వయస్సులోనూ తన పేరునే ఒక బ్రాండ్ గా మార్చుకుని రాజకీయంగా ముందుకెళుతున్న చంద్రబాబు ఇక ఆంధ్రా ప్రజల కలల రాజధాని అమరావతి, ఏపీ జీవనాడి పోలవరం కూడా పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తే ఆయన రాజకీయ జీవితం భవిష్యత్ రాజకీయ నేతలకు ఒక ‘డిక్షనరీ’ మాదిరి ఒక ‘లైబ్రరీ’ లెక్క మారుతుందేమో బహుశా…!







