బాబు VS రేవంత్….?

Chandrababu-Naidu-.Revanth-Reddy

మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ తమ పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఆంధ్ర, తెలంగాణ నుంచి ప్రముఖ నాయకులు మహారాష్ట్ర చేరనున్నారు.

ADVERTISEMENT

ఇందులో ముఖ్యంగా ఎన్డీయే లో భాగస్వామిగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించగా, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పార్టీ నేతల తరుపున ప్రచారానికి సిద్ధమయ్యారు.

అయితే రేవంత్ నేడు, రేపు మహారాష్ట్రలోని తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ తరుపున విస్తృత ప్రచారం చేస్తూ సభలు, రోడ్ షో లలో పాల్గొననున్నారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి బాబు నేడు ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆ పిమ్మట మహారాష్ట్ర ఎన్డీయే అభ్యర్థుల తరుపున ప్రచార కార్యక్రమంలో మెరవనున్నారు.

ఇక వీరిద్దరికి తోడు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీయే అభ్యర్థి గెలుపు కోసం 16 ,17 తేదీలలో మహారాష్ట్ర లోని మరట్వాడ, పశ్చిమ మహారాష్ట్ర, విదర్భ వంటి కీలక ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

కేంద్రంలో ఉప్పు నిప్పుగా పోరాడుతున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ముఖ్య నేత అయిన పవన్ కళ్యాణ్ ను తమ పార్టీ తరుపున స్టార్ క్యాంపెయినర్లుగా రంగంలోకి దింపనుంది.

కాంగ్రెస్ గెలుపు కోసం రేవంత్ రెడ్డి, ఎన్డీయే గెలుపు కోసం బాబు, పవన్ హోరాహోరీ ప్రచారం చేయనున్నారు. దీనితో తెలంగాణ ఎన్నికలలో చూడలేని బాబు VS రేవంత్ ఎన్నికల యుద్ధం మహారాష్ట్రలో దర్శనమిస్తుందన్నమాట. అనుకున్న స్థాయి విజయాలు అందుకోలేక బీజేపీ, ఊహించని విజయాలతో కాంగ్రెస్ రెండు పార్టీలు గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

మరి ఎన్డీయే తరుపున బాబు, పవన్ ల ప్రచారం ఫలిస్తుందా, కాంగ్రెస్ తరుపున రేవంత్ చేసిన ప్రచారానికి ఫలితం దక్కుతుందా అనేది తేలాలంటే కాస్త సమయం తప్పనిసరే సుమీ..! అయితే ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన అక్కడ బాబు, పవన్ ల ప్రాబల్యం పెరగడం కాయం.

ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి బాబు, పవన్ ల సహకారం జీవన్మరణ సమస్యగా మారుతుంది. అలాగే ఒకవేళ బీజేపీ గెలిస్తే పార్టీ గెలుపు కోసం సమయం కేటాయించిన బాబు, పవన్ లకు కేంద్రంలో, బీజేపీ పెద్దలలో గౌరవం మరింత పెరుగుతుంది.

ADVERTISEMENT
Latest Stories