
నేడు కడప మహానాడు రెండో రోజున సిఎం చంద్రబాబు నాయుడు ప్రసంగంలో హత్యా రాజకీయాల గురించి మాట్లాడుతూ, వివేకానంద రెడ్డి హత్య గురించి ప్రస్తావించి, టీడీపీ నేతలు, కార్యకర్తలని అప్రమత్తంగా ఉనాలని సూచించడం విశేషం.
“మొదట వార్తలలో ఆయన గుండెపోటుతో చనిపోయారని చూసి అదే నిజమనుకున్నాన్నారు. కానీ సాయంత్రంలోగా ఆ కధ అనేక మలుపులు తిరిగి చివరికి హత్య అని తేలింది. ఆయనని గొడ్డలితో అంత దారుణంగా హత్య చేసిన తర్వాత గుండెపోటు అని అందరినీ నమ్మించే ప్రయత్నం చేయడం చూసి తాను ఆశ్చర్యపోయానని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
Also Read – రప్పా రప్పా మీరు తొక్కేస్తే.. మేం లోపలేస్తాం!
మరికొద్ది సేపటికి ఆ హత్య నేనే చేయించానని వైసీపీ దుష్ప్రచారం మొదలుపెట్టేసరికి షాక్ అయ్యానని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. తామందరం ఎన్నికల హడావుడిలో ఉన్నందున వివేకా హత్య వ్యవహారాన్ని రాజకీయంగా సరిగ్గా ఎదుర్కోలేకపోయామని చంద్రబాబు నాయుడు చెప్పారు.
“ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడా హత్య కేసు గురించి ఎందుకు చెప్తున్నానంటే అటువంటి కరడు గట్టిన నేరస్తులతో మనమందరం రాజకీయాలు చేస్తున్నామనే విషయం గుర్తుంచుకొనేందుకే,” అని చంద్రబాబు నాయుడు చెప్పారు.
Also Read – నేను రప్పా రప్పా తొక్కేస్తాను.. బాధ్యత చంద్రబాబుదే!
2019 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చేతిలో అధికార యంత్రాంగం అంతా ఉంది. అయినప్పటికీ ఈ హత్యా రాజకీయాన్ని సకాలంలో పసిగట్టలేకపోయారు. అందుకు ఆయనతో పాటు టీడీపీ కూడా మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
కానీ దాని నుంచి వైసీపీ ఎటువంటిది? అది ఏవిదంగా పావులు కదుపుతుంది?వంటి అనేక గుణ పాఠాలు చంద్రబాబు నాయుడు నేర్చుకోగలిగారు.
Also Read – ‘పోరు’ బాటలు కాదు ‘ప్రతీకార’ చర్యలే…
అందువల్లే నాడు (2014-2019) వైసీపీతో వ్యవహరించిన తీరుకి, ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరుకి తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
కానీ క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవారితో రాజకీయాలు చేయడం అంటే పాముతో చెలగాటం ఆడటం వంటిదే. కనుక చంద్రబాబు నాయుడు పార్టీలో అందరూ అప్రమత్తంగా ఉండాలని హితవు చెపుతున్నారు. నిజమేగా!