Chandrababu Naidu with his Wife at Balaji Temple Venkatapalem

అలనాడు అనేకమంది మునులు, రాజులు, రాక్షసులు ఘోర తపస్సులు చేసి దేవుడిని రప్పించుకుని వరాలు పొందారు.

ప్రహ్లాదుడునీ శ్రీహరి కరుణించాడు. తనని ద్వేషించిన హిరణ్యకశిపుడిని నరసింహావతారంలో మోక్షం ప్రసాదించాడు. నిండు సభలో వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ద్రౌపది మొర ఆలకించి ఆదుకున్నాడు. మొసలి నోట చిక్కిన గజేంద్రుడు ప్రార్ధించినప్పుడూ సిరికిన్ జెప్పకనే వచ్చి ఆదుకున్నాడు.

Also Read – ఉల్ఫా బ్యాచ్ అట… జగన్‌ హర్ట్ అవరూ?

ఆ విధంగా దేవుడినే తన వద్దకు రప్పించుకున్న మహాభక్తులలో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఒకరు.

ఆయన క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నప్పటికీ తిరుమల శ్రీవారిని దర్శించుకునేవారు. టీటీడీని తన భక్తులతో నింపేశారు. వారందరూ 5 ఏళ్ళలో తిరుమల స్వామివారికే కల్తీ నెయ్యితో నైవేద్యాలు పెట్టి తమ జన్మలు సార్ధకం చేసుకున్నారు.

Also Read – గెలిస్తే ఇక్కడి నుండి సమరం, లేదా తిరుగు ప్రయాణం..!

ఆనాడు శిశుపాలుడు, హిరణ్యకశిపుడు పిలిస్తేనే ‘నేను విన్నాను.. నేనున్నాను..’ అంటూ పలికిన శ్రీమన్నారాయణుడు అన్యమతస్తుడైన జగన్మోహన్ రెడ్డి పిలిస్తే పలకడా? తప్పకుండా పలుకుతాడు.

తన పరమభక్తుడు జగన్‌ త్వరలో గద్దె దిగబోతున్నాడని కరుణించాడో ఏమో 2024 సంక్రాంతి పండుగకు ఆలయం (సెట్టింగ్)తో సహా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి తాడేపల్లి ప్యాలస్‌కు చేరుకున్నాడు.

Also Read – భారత్‌లో పాకిస్తానీలు.. ఓటు బ్యాంక్ రాజకీయాలు!

అలనాడు సీతమ్మ బంగారు లేడి తెమ్మనని శ్రీరాముడిని అడిగి అష్ట కష్టాలు అనుభవించిన్నట్లే, తిరుమల శ్రీవారిని తన గడప వద్దకు రప్పించుకున్నందుకే భారతీ మేడం కూడా అష్టకష్టాలు అనుభవిస్తున్నారని గిట్టనివారు నేటికీ చెవులు కోరుకుంటూనే ఉన్నారు.

కానీ తనని గుమ్మం దగ్గరకు రప్పించుకున్న మహాభక్తుడు జగన్‌ని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారు అనుగ్రహించి కి ఎన్నటికీ చెరిగిపోని ‘11’ నామాలు ప్రసాదించారనే వాదనలు కూడా వినపడుతూనే ఉన్నాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే, సిఎం చంద్రబాబు నాయుడు జగన్‌ అంత మహాభక్తుడు కారు. కనుక ఆయనే సతీసమేతంగా అమరావతిలో వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.




జగన్‌ భక్తుడు పిలిస్తే పలికి 11 నామం ప్రసాదించిన స్వామివారు తన వద్దకే వచ్చిన సిఎం చంద్రబాబు నాయుడుకి 165 సీట్లు ఎందుకు ఇచ్చాడు. అందుకే సిరివెన్నెల సీతారామశాస్త్రి ‘ఆదిభిక్షువు వాడు వాడిని ఏమి కోరేదీ..’ అంటూ ఆ భగవంతడు ఓ తిక్క శంకరయ్య అని తేల్చేశారు.