కూటమి-వైసీపీ మద్య తేడా ఇదే!

Chandrababu Naidu addressing leaders highlighting leadership difference with YSRCP

సిఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ఉండవల్లిలో శ్రీకాకుళం జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశమైనప్పుడు పాతపట్నం టీడీపి ఎమ్మెల్యే గోవిందరావుకి చివాట్లు పెట్టారు.

“ప్రజా ప్రతినిధులు ప్రజలతో అణకువగా మెలగాలి. ముఖ్యంగా తొలిసారి ఎమ్మెల్యే అయినవారు మరింత అణకువగా మెలుగుతూ ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ నీపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. పాతపట్నం మొదటి నుంచి టీడీపికి కంచుకోట. కనుక అక్కడ నీ గెలుపు నీ సొంతం కాదు. పార్టీ బలంతోనే గెలిచావన్న విషయం మరిచిపోకు. నీ వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే సహించే ప్రసక్తి లేదు. ఇకనైనా తీరు మార్చుకో లేకుంటే నీకే నష్టం. నాకు వ్యక్తుల కంటే పార్టీయే ముఖ్యం,” అని సిఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే గోవిన్దరవుకి చివాట్లు పెట్టారు.

ADVERTISEMENT

తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో కొందరు అహంభావంతో మిడిసిపడుతూ ప్రజలలో చెడ్డపేరు తెచ్చుకొని ఇలా చివాట్లు తింటారు. అన్ని పార్టీలలో ఇది సర్వసాధారణమే. అధినేత హెచ్చరించిన తర్వాత తప్పులు తెలుసుకొని, వైఖరి మార్చుకున్నవారే రాజకీయాలలో రాణిస్తుంటారు. కానీ అధినేత హెచ్చరికలను ‘నెగెటివ్’గా తీసుకునేవారి రాజకీయ చరిత్ర త్వరగానే ముగిసిపోతుంటుంది.

ఇక్కడ ఎమ్మెల్యేకి సిఎం చివాట్లు పెట్టడం, ఆయనలో మార్పు వస్తుందా రాదా? అనే విషయం పక్కన పెడితే కూటమి ప్రభుత్వం గ్రాఫ్ నానాటికీ పైకి వెళ్తుంటే, కొందరు టీడీపి, జనసేన ఎమ్మెల్యేల గ్రాఫ్ నానాటికీ పడిపోతోంది.

ఇటీవల డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి క్లాస్ పీకాల్సిరాగా ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు క్లాస్ పీకాల్సిరావడమే ఇందుకు నిదర్శనం.

పార్టీ నేతలకు, ప్రజా ప్రతినిధులందరికీ పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ట మన మీదే ఆధారపడి ఉంటుందనే ఇంగితం ఉండాలి. ఒకవేళ వారి తప్పులు అధినేత దృష్టికి రాకపోయి సరిచేయకుంటే నష్టపోయేది పార్టీ, ప్రభుత్వమే కదా? కనుక ఇలా ప్రతీసారి తప్పులు సరిచేసుకోమని అధినేత హెచ్చరించే పరిస్థితి తెచ్చుకోకూడదు.

ఈ నేపధ్యంలో వైసీపీని ఓ సారి గమనిస్తే, అధికారంలో ఉన్నప్పుడూ లేనప్పుడూ కూడా ఆ పార్టీ అధినేత జగన్‌ తన పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులకు ఈవిధంగా గాడిన పెట్టుకునే ప్రయత్నం చేయకపోగా, స్వయంగా తప్పటడుగులు వేస్తూ అందరినీ తప్పుడు మార్గంలోనే నడిపిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు: శాసనసభలో చంద్రబాబు నాయుడుని, ఆయన సతీమణి గురించి వైసీపీ ఎమ్మెల్యేల చేత అనుచితంగా మాట్లాడించి అయన బాధ పడుతుంటే చిర్నవ్వులు చిందించడం ఇందుకు ఓ చక్కటి ఉదాహరణ. పవన్ కళ్యాణ్‌ మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడిన మాటలు వంటి తప్పులు చాలానే ఉన్నాయి కదా?

అధికారంలో లేనప్పుడు: పార్టీ శ్రేణులు తమ ప్రత్యర్ధుల తలకాయలు రప్పా రప్పా నరికేస్తాం అంటుంటే వారిని వెనకేసుకు రావడం. కేంద్ర ప్రభుత్వం అమరావతికి ఆమోదం తెలుపుతుంటే ‘మావిగన్‌’ ప్రతిపాదన చేయడం. పార్టీ నేతలందరి చేత ఆ పాట పాడిస్తూ, అమరావతిపై దుష్ప్రచారం చేయించడం. సిఎం చంద్రబాబు నాయుడుపై బురద జల్లాలని ప్రోత్సహించడం. అందరినీ హైదరాబాద్‌ పంపించి ఏబీఎన్ కార్యాలయంపై దాడి చేయమని ప్రోత్సహించడం వంటి దుర్లక్షణాలు కనిపిస్తున్నాయి కదా?

సిఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను, ప్రజా ప్రతినిధులను నిశితంగా గమనిస్తూ దారి తప్పుతున్నవారిని ఎప్పటికప్పుడు సరిదిద్దుతుంటారు కనుకనే నాలుగు దశబ్దాలుగా టీడీపి అనేక ఒడిదుడుకులు తట్టుకొని ఇంత బలంగా నిలబడగలిగింది.

కానీ జగన్మోహన్ రెడ్డి స్వయంగా తప్పులు చేస్తూ పార్టీని కూడా ఆ చెడు మార్గంలో నడిపిస్తుంటారు. కనుకనే ఉవ్వెత్తున ఆకాశం అంత ఎత్తుకి ఎగిసిపడి పాతాళంలోకి పడిపోయింది. తమ తప్పులు, దుర్లక్షణాల వల్లనే తమకీ దుర్గతి పట్టిందని నేటికీ గ్రహించకపోగా, ఈ తప్పుడు ఆలోచనలు, దుర్లక్షణాలే తమ బలం అన్నట్లు వ్యవహరిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు సరైన మార్గంలో నడుస్తూ అందరినీ సన్మార్గంలో నడిపిస్తున్నారు. రెండు పార్టీలలో కొంత మంది తప్ప మిగిలినవారు బుద్దిగా, పద్దతిగా మెసులుకుంటూ ప్రజలలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు.

కానీ వైసీపీలో? టీడీపి, జనసేన-వైసీపీ మూడు పార్టీల అధినేతల ఆలోచనా విధానంలో, వారు పార్టీలను నడిపిస్తున్న విధానంలో, మూడు పార్టీల నేతల తీరులో ఇంత తేడా కనిపిస్తోంది. కనుక ప్రజలు ఎటువంటి పార్టీలని కోరుకుంటారో వేరే చెప్పాలా?

ADVERTISEMENT
Latest Stories