గత మూడు రోజులుగా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు గ్రూపులుగా ఫార్మ్ అయ్యి.. మీడియా ముఖంగా ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుంటున్న విధానాన్ని చూస్తూనే ఉన్నాం. ఎగ్జిబిటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ గా మొదలైన ఈ గొడవ.. ఒకానొక సందర్భంలో దిల్ రాజు వర్సెస్ మైత్రిగా, అనంతరం ప్రొడ్యూసర్స్ వర్సెస్ ఏషియన్ సునీల్ అన్నట్లుగా రూపాంతరం చెందింది.
నాగవంశీ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ “పెద్ది” సినిమాకి గనుక ఇష్యూ అయితే.. మేము చిరంజీవి గారి దగ్గరకి సమస్యని తీసుకెళ్తాం అని చెప్పగా.. చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యి ఇరువైపు సమస్యలు విని రెస్పాండ్ అయితే ఇంకా మంచిది అని ఎగ్జిబిటర్లు కూడా సుముఖత చూపారు.
అయితే.. చిరంజీవి ఇప్పుడు పెద్ది వరకు మాత్రమే సొల్యూషన్ ఇస్తారా? లేక పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తారా? అనేది చూడాల్సి ఉంది. ఇకపోతే.. ఈ గొడవలో నిజంగానే హీరోలు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తే.. వాళ్లు ఎవరివైపు నిలబడతారు? అనేది హాట్ టాపిక్ గా మారింది.
ఎందుకంటే.. స్టార్ హీరోల్లో ప్రముఖులైన మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండలు ఆల్రెడీ ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్నారు, అలాగే వాళ్ళందరూ మైత్రీ సంస్థలో సినిమాలు కూడా చేశారు, చేస్తున్నారు, చేయబోతున్నారు. ఇలాంటి తరుణంలో హీరోలు ఎవరికి సపోర్ట్ చేస్తారు? అనేది కూడా హాట్ టాపిక్కే. మరి ఈ గొడవ ఎప్పటికీ ఓ కొలిక్కి వస్తుందో చూడాలి.






