
సిఎం చంద్రబాబు నాయుడు దంపతులు, నారా లోకేష్ దంపతులు వారి కుమారుడు దేవాంశ్ అందరూ కలిసి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ ఆన్నదానసత్రంలో దేవాంశ్ పేరుతో నేడు ఆన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి దంపతులు, మంత్రి నారా లోకేష్ దంపతులు స్వయంగా వడ్డిస్తూ ఆప్యాయంగా అందరినీ పలకరిస్తుంటే భక్తులు సంతోషంతో పొంగిపోయారు. వారితో కలిసి దేవాంశ్ కూడా భోజనాలు వడ్డిస్తుంటే అందరూ అతనిని చూసి మురిసిపోయారు. చాలా మంది వారిని మనసారా ఆశీర్వదించారు.
Also Read – వైసీపీ చేపల వేట ఫలించేనా?
నారా కుటుంబ సభ్యులందరూ తరచూ ఏదో ఓ సందర్భంలో ఒకేచోట కనిపిస్తుంటారు. అందరూ కలిసికట్టుగా ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొంటుండటం ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు.
ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా కనిపిస్తున్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ ఎందుకు కుటుంబ సమేతంగా కనిపించరు?అనే ఆలోచన ఎవరికైనా కలుగుతుంది.
Also Read – ప్రమోషన్స్ అంటే ఇలా.. అందరూ చూసి నేర్చుకోండయ్యా!
వారి ఇద్దరు కుమార్తెలు విదేశాలలో చదువుకుంటున్నందున వారు గ్రూప్ ఫోటోలో కనిపించకపోవచ్చు. కానీ జగన్ సతీమణి భారతి చాలా అరుదుగా భర్తతో కలిసి బయట కనిపిస్తారు. అందుకు ఆమెను తప్పు పట్టడం సబబు కాదు కూడా. వారి మద్య బంధాన్ని లోకానికి చాటుకోనవసరం లేదు కూడా.
కానీ బాబాయ్‌ని, తల్లిని, చెల్లిని దూరం చేసుకున్న జగన్ వెంట ఆయన సతీమణి భారతి కూడా కనిపించకపోతే జగన్ ఎప్పుడూ ఒంటరివారే అనే భావన ప్రజలకు కలుగుతుంది కదా?
Also Read – హామీలన్నీ అమలు చేసేస్తే మేం దేని కోసం పోరాడాలి బాబూ?