ఐప్యాక్ వందల కోట్లు ఫీజులు తీసుకొని జగన్‌కి ‘శాస్త్రీయంగా శల్యసారధ్యం’ చేస్తూ ప్యాకప్ చేయించేసింది. ఓ పార్టీ ఎన్నికలలో గెలవాలంటే కుట్రలు, కుతంత్రాలు అమలుచేస్తూ, ప్రత్యర్ధులపై దుష్ప్రచారం చేయడమే సరికొత్తవిధానం అన్నట్లు అది పనిచేసేది.
వందల కోట్లు ఫీజు తీసుకున్నా ప్రభుత్వం పనితీరు ఏవిదంగా ఉంది?లోపాలు, వైఫ్యల్యాలు ఏమిటి? వాటిని ఏవిదంగా సరిదిద్దుకోవచ్చు? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు ఏమిటి?అసలు ప్రభుత్వం నుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారు?అనే ముఖ్యమైన విషయాలు మాత్రం చెప్పలేదు.
చివరి నిమిషం వరకు శల్య సారధ్యం చేస్తుండటం వలననే జగన్ 175కి 175 సీట్లు మనకే అనే గుడ్డి నమ్మకంతో బోర్లా పడ్డారు.
శాసనసభ ఎన్నికలలో టీడీపీ వ్యూహకర్తగా పనిచేసిన రాబిన్ శర్మ సూచన మేరకు సిఎం చంద్రబాబు నాయుడు ‘సిఎం ఫెలోస్’ అనే ఓ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు.
దేశంలో ఐఐఎం, ఐఐటి వంటి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల నుంచి బయటకు వచ్చిన మెరికల్లాంటి యువతతో ఈ టీమ్ ఏర్పాటు కాబోతోంది.
రాబిన్ శర్మ టీమ్‌లో పనిచేసిన అనంత్ తివారీ ఆధ్వర్యంలో ఒక్కో జిల్లాకు ఒకరు చొప్పున మొత్తం 25 మందితో ఈ ‘సీఎం ఫెలోస్’ టీమ్ ఏర్పాటు కాబోతోంది. ఇది ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుబంధంగా పనిచేస్తుంది. దీనిలో పని చేసేవారికి ప్రభుత్వం ఆకర్షణీయమైన జీతభత్యాలు చెల్లిస్తుంది. ఇప్పటికే ఈ టీమ్ ఎంపిక మొదలైంది. అది పూర్తవగానే శిక్షణా కార్యక్రమ నిర్వహించి బాధ్యతలు అప్పగిస్తుంది. ఇది 2025 ఏప్రిల్ నుంచి పనిచేయడం ప్రారంభించబోతోంది.
సీఎం ఫెలోస్ బాధ్యతలు:
ప్రభుత్వం పనితీరు ఏవిదంగా ఉంది.?ఎక్కడెక్కడ ఎటువంటి లోపాలున్నాయి? ప్రభుత్వం పనితీరు, అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు?ఏమి కోరుకుంటున్నారు? ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు?జిల్లాల వారీగా చేపట్టాల్సిన పనులు, ప్రాధాన్యతలు వంటి సమాచారం సేకరించడం.
ప్రజల నుంచి ఎప్పటికప్పుడు వీటన్నిటి గురించి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ, నేరుగా సిఎం చంద్రబాబు నాయుడుకి నివేదించడం. ఆ తర్వాత ఫాలో అప్ చేస్తుండటం. చంద్రబాబు నాయుడుని ముసలోడు అంటూ అవహేళన చేసే యువకుడైన జగన్‌కు ఇటువంటి చక్కటి ఆలోచనలు ఎందుకు రావో?




