పిక్ టాక్ – బాబు కోరిక తీరినట్లే ఉంది!

chandrababu-kidఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితుల నేపధ్యంలో… తన మనవడు దేవాన్ష్ తో ఆడుకోవడం కుదరట్లేదని, అసలు తన మనవడు తనను గుర్తుపట్టే స్థితిలో లేడని, చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన పడిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా తన మనవడితో గడిపేందుకు హైదరాబాద్ వెళ్ళిన చంద్రబాబు ముఖంలో చిరు దరహాసం తాండవించడం విశేషం.

ADVERTISEMENT

బహుశా దేవాన్ష్ తన తాతను గుర్తు పట్టాడో ఏమో గానీ, నాయనమ్మ, తాతయ్యల నడుమ ఉన్న ఈ ఫోటోను నారా లోకేష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. సతీమణి భువనేశ్వరితో కలిసి మనవడితో సరదా సమయం గడుపుతుండడంతో… చంద్రబాబు ఆకాంక్ష కొంతైనా నేరవేరినట్లుగా కనపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories