విశాఖ నుంచి పాలన… అందుకేనా?

AP CM YS Jaganవిజయదశమి రోజున విశాఖ నుంచి రాష్ట్రాన్ని ఏలేద్దాం అందరూ మూటాముల్లె సర్ధుకొని బయలుదేరండని సిఎం జగన్‌ ఇవాళ్ళ మంత్రివర్గ సమావేశంలో చెప్పేశారు. మొదట మార్చి, తర్వాత జూలై, నవంబర్‌లో మకాం మార్చుతానని చెప్పిన జగన్‌ హటాత్తుగా ఒక నెల ముందుగా అక్టోబర్ 24నే విశాఖకు మకాం మార్చేయాలనుకోవడం యాదృచ్చికం కాదు.

బహుశః శాసనసభ సమావేశాల చివరి రోజున ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నానని బాంబు పేల్చి ముందస్తుకు వెళుతున్నట్లు ప్రకటించినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం టిడిపి బలహీనంగా ఉంది. కనుక వైసీపి ముందస్తు ఎన్నికలకు వెళ్ళవచ్చు. దీని వలన రెండు లాభాలున్నాయి.

ADVERTISEMENT

గత నాలుగేళ్ళుగా మూడు రాజధానులంటూ పాడి చివరికి విశాఖ ఒక్కటే రాజధాని అని తేల్చేశారు. కానీ అది కూడా ఏర్పాటు చేయలేకపోయారని టిడిపి, జనసేనలు ఎద్దేవా చేస్తూనే ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తప్పకుండా అమరావతి రాజధాని అంశం ఓటర్లను ప్రభావితం చేస్తుంది. కనుక ‘విశాఖ నుంచి పాలన’ పేరుతో ఎన్నికలయ్యే వరకు ప్రజలను మభ్య పెట్టగలిగితే వైసీపి ఒడ్డున పడుతుంది.

అమరావతి గురించి ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో టిడిపి లేదు. ఇదే కారణంగా జగన్‌ విశాఖకు మకాం మార్చినా దాని గురించి కూడా టిడిపి గట్టిగా మాట్లాడలేకపోవచ్చు. కనుక ఎన్నికలలో ‘విశాఖ రాజధాని-దాని వలన కలిగే ప్రయోజనాలు’ గురించి వైసీపి ఎంచక్కా డబ్బా కొట్టుకోవచ్చు.

ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్టుతో రాష్ట్ర ప్రజలలో ఆయన పట్ల సానుభూతి పెరిగిపోయింది. అది ఓట్ల రూపంలో కురిస్తే వైసీపి నష్టపోతుంది. కనుక ఆ సానుభూతిని కరిగించేయాలంటే రాష్ట్ర ప్రజల దృష్టిని చంద్రబాబు నాయుడు అరెస్ట్ నుంచి మళ్ళించాలి. దానికి ‘విశాఖ రాజధాని’ డ్రామా సరిపోతుంది.

అందరూ ఈ మాయలో పడి దాని గురించే చర్చించుకొంటారనేది దీనికి వెనుక వ్యూహంగా కనిపిస్తోంది. బహుశః అందుకే విశాఖ రాజధాని డ్రామా మొదలుపెట్టి ఉండవచ్చు.

అయితే రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. అది పూర్తయ్యే వరకు విశాఖ రాజధానికి సంబందించి ఎటువంటి నిర్ణయాలు, నిర్మాణాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా హెచ్చరించింది. అయినప్పటికీ వైసీపి ప్రభుత్వం విశాఖలో ఋషికొండపై భవనాలు నిర్మించేసింది. కానీ నేటికీ అవి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం లేదా సచివాలయం కావని నమ్మబలుకుతోంది.

కానీ సిఎం జగన్‌ ఇప్పుడు విశాఖ నుంచి పాలన మొదలుపెడితే పరదాలు కప్పిన వాటిలో నుంచి రహస్యంగా రాష్ట్రాన్ని పాలించలేరు. మరెలా? అంటే బహుశః విశాఖ రాజధానికి మోడీ, అమిత్ షాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండవచ్చు. వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశమే ఎక్కువ. కనుక అన్నీ చక్కబెట్టుకొన్నాకనే జగన్‌ విశాఖకు మకాం మార్చాలని నిర్ణయించి ఉండవచ్చు.

ADVERTISEMENT
Latest Stories