
కాంగ్రెస్, బీజేపిల వైఖరి, విధానాలు చాలా భిన్నంగా ఉంటాయని అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీలో భావ ప్రకటన స్వేచ్చ ఎక్కువ కనుక కింద నుంచి పైవరకు అందరూ తమకు నచ్చినట్లు మాట్లాడేస్తుంటారు.
అదే ఆ పార్టీకి పెద్ద ప్లస్… చాలాసార్లు ఆ పార్టీకి అదే పెద్ద మైనస్‌గా కూడా మారుతుంటుంది. కానీ అంత మాత్రాన్న ఆ పార్టీలో ప్రజాస్వామ్యం కళకళలాడిపోతోందనుకోలేము.
Also Read – జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: మూడు స్తంభాలాటేనా.?
కాంగ్రెస్ నేతృత్వంలో యూపీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ ప్రధాని పదవి చేపట్టాలనుకున్నారు. కానీ కుదరకపోవడంతో తాను చెప్పినట్లు వినే వీరవిధేయుడైన డాక్టర్ మన్మోహన్ సింగ్‌ని ఆ కుర్చీలో కూర్చోపెట్టి తానే దేశాన్ని పాలించారు.
ఆ తర్వాత మోడీ, అమిత్ షా ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయింది. సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేలేకపోయినా రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలపై కర్ర పెత్తనం చేయడం మానుకోలేదు.
Also Read – జగన్‌వి శవరాజకీయాలట .. ఎంత మాటనేశారు నారాయణా?
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఏడాదిన్నరలో సుమారు 50 సార్లు ఢిల్లీకి వెళ్ళివచ్చారు. అంటే సగటున నెలకు రెండుసార్లు ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిశారన్న మాట! మిగిలిన రాష్ట్రాలలో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
కాంగ్రెస్ అధిష్టానం అనుమతిస్తేనే రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంలో ముగ్గురిని తీసుకోగలిగారు. అందుకు ఏడాదిన్నర సమయం పట్టింది. మరో మూడు ఖాళీలకు ఇంకా అనుమతి లభించలేదు. కనుక అవలాగే ఉన్నాయి.
Also Read – జనసేన ఎమ్మెల్యే లు: అరుంధతి నక్షత్రలా.?
ఇదంతా దేనికంటే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఏవిదంగా ఉందో గ్రహించేందుకు. బీజేపిలో ఇంత స్వేచ్చ ఉండదు. దానిని క్రమశిక్షణ అని ముద్దుపేరు పెట్టుకున్నారు.
కానీ కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపిలో కష్టపడి పనిచేసే వారికి, ముఖ్యంగా పార్టీ (హిందుత్వ)సిద్దాంతాలకు కట్టుబడి ఉన్నవారికి అవకాశాలు లభిస్తుంటాయి.
కానీ కాంగ్రెస్ పార్టీలో మాదిరిగానే బీజేపిలో కూడా వ్యక్తిపూజ ఉందనేది వాస్తవం. నిజానికి ఇప్పుడు దేశంలో అన్ని పార్టీలలో వ్యక్తిపూజ చాలా కామన్. అయితే కాంగ్రెస్ పార్టీలో అది మరికాస్త ఎక్కువగా కనబడుతుంటుంది. కాంగ్రెస్ అధిష్టానానికి వీర విధేయులుగా ఉంటూ దాని కనుసన్నలలో పనిచేసే వారికి మాత్రమే పార్టీలో ప్రాధాన్యం ఉంటుంది.
దీనిపై ఏపీ బీజేపి ఓ చక్కటి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రోబో సినిమాలో రజనీకాంత్ తన అదుపాజ్ఞలలో పనిచేసే చిట్టీ అనే రోబోని తయారుచేసినట్లే కాంగ్రెస్ అధిష్టానం కూడా తన కనుసన్నలలో పనిచేసే రోబోల వంటి నేతలను తయారుచేస్తోందంటూ ‘రోబో’ సినిమాలో ఓ సన్నివేశం, పార్లమెంటులో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వీడియోలని ఎక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది చూసినప్పుడు అవును నిజమే కదా? అని అనుకోకుండా ఉండలేము.
నాయకులను కాకుండా వాళ్లు చెప్పినట్లు చేసి, వారి కనుసన్నల్లోనే పనిచేసే రోబోలను తయారు చేస్తున్న @INCIndia పార్టీ.#Scamgress pic.twitter.com/4iMiQbCjNr
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) July 6, 2025