హైడ్రా చర్యలతో చిక్కులలో పడిన అక్కినేని నాగార్జున పై మరోసారి తన మాటల దాడిని కొనసాగిస్తున్నారు సిపిఐ నేత నారాయణ. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలో నాగార్జునకు దాదాపు 500 కోట్ల నష్టం వాటిలిందంటూ వార్తలు ప్రచారంలో ఉండగానే నారాయణ మరో కొత్త వాదాన్ని తెర మీదకు తీసుకు వచ్చారు.
దశబ్ద కాలం పాటు నాగార్జున దొంగ డాక్యుమెంట్లు సృష్టించి చెరువును అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి తద్వారా వందల కోట్ల ఆదాయాన్ని వెనకేసుకున్నారనీ, ఆ మొత్తాన్ని అద్దె రూపంలో నాగార్జున నుండి ప్రభుత్వం తిరిగి వసులు చేసేలా చర్యలు తీసుకోవాలంటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు నారాయణ.
అలాగే ఒక ప్రముఖ స్థానంలో ఉన్న వ్యక్తే ఇలా చట్టాల కళ్లుకప్పి ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటే ఇక సామాన్యుడికి ఆదర్శంగా ఎలా ఉండగలుగుతారు, ఇటువంటి వారు హీరోలా?, ఈయన బిగ్ బాస్ లకే బిగ్ బాస్ లాగ వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు. అలాగే ఒకప్పటి బిగ్ బాస్ కన్సిస్టెంట్, హేతువాది బాబు గోగినేని కూడా ఈ వివాదంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతూ నాగార్జున చర్యలను తప్పుపట్టారు.
నాగార్జునను వెంటనే బిగ్ బాస్ హోస్ట్ గా తప్పించాలంటూ బాబు గోగినేని బిగ్ బాస్ నిర్వాహుకులకు తన సోషల్ మీడియాలో అల్టిమేటం జారీ చేసారు. ఇలా ఒక్క వివాదం ఎన్నో ఏళ్ళ నుంచి నిర్మించుకున్న అద్దాల మీద పై రాళ్ళూ పడేలా చేసింది. ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తో అందరి నోళ్ళల్లో నానుతు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటున్న నాగార్జున ఇక త్వరలో ప్రారభం కానున్న బిగ్ బాస్ కార్యక్రమం నుండి కూడా తప్పించాలి అంటూ డిమాండ్లు రావడం ఆ షో జయాపజల మీద ప్రభావాన్ని చూపబోతుందా అనే సందేహాలు మొదలయ్యాయి.




