జనసేనతో జట్టు కట్టేందుకు సీపీఐ రెడీ అవుతోంది. తమ లాంటి ఆలోచనలే కలిగిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో కలిసి ముందుకు నడిచేందుకు తాము సిద్ధమని ప్రకటించింది. మంగళగిరిలో జరుగుతున్న గుంటూరు జిల్లా సీపీఐ 24వ మహాసభల ప్రతినిధుల సభకు హాజరైన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజా అజెండాతో ముందుకొచ్చే వారితోనే తమ పయనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పవన్ కూడా తమ ఆలోచనా విధానంలోనే నడుస్తున్నారని, కడపలో నిర్వహించనున్న రాష్ట్ర మహాసభల అనంతరం ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే ఎవరితో కలిసి ముందుకువెళ్లాలన్న విషయంలో ఇప్పటి వరకైతే స్పష్టత లేదన్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT



