వాలంటీర్లు-సాక్షి పేపరు: ఓ కోర్టు కేసు!

jagan_bharatiఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే పార్టీ అవసరాల కోసం వాలంటీర్ వ్యవస్థను సృష్టించింది. చట్టబద్దతలేని 4 లక్షల మంది వాలంటీర్లు ఓ ప్రైవేట్ సైన్యం వంటివారని దండుపాళెం బ్యాచ్ అని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర విమర్శలు చేశారు. వారితో జగన్ ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుంటే, వారిలో కొందరు ఒంటరి మహిళలపై దాడులు చేసి దోచుకొంటున్నారని పవన్‌ కళ్యాణ్‌ ఆరోపిస్తున్నారు. ఆయన చెప్పిన్నట్లుగానే ఇటీవల విశాఖ పశ్చిమ నియోజకవర్గం పెందుర్తి వద్ద సుజాతానగర్ కాలనీలో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలిని ఓ వాలంటీర్ హత్య చేసి ఆమె ఒంటిపై బంగారు ఆభరణాలు దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇది వాలంటీర్ వ్యవస్థ వలన రాష్ట్రానికి, ప్రజలకు ఎంత ప్రమాదమో తెలియజేస్తోంది. కానీ వారికి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు, నగదు బహుమతులు కూడా ఇస్తోంది కూడా.

అలాంటి వాలంటీర్ వ్యవస్థే రాష్ట్రానికి, ప్రభుత్వానికి భారమనుకొంటే, వారికి సాక్షి న్యూస్ పేపర్ కొనుగోలు చేసేందుకు జగన్ ప్రభుత్వం ఒక్కొక్కరికి నెలకు రూ.200 చొప్పున చెల్లిస్తోంది. వాలంటీర్ వ్యవస్థకే చట్టబద్దత లేదు. పైగా వారి పేరుతో జగన్‌ కుటుంబానికి చెందిన సాక్షి పేపర్ అమ్మకాలను పెంచుకోవడం ఇంకా నేరం, చట్టవిరుద్దం అంటూ ఉషోదయా పబ్లికేషన్స్ (ఈనాడు గ్రూప్) ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్‌ వేసింది. దానిని విచారణకు స్వీకరించిన హైకోర్టు సిఎం జగన్మోహన్ రెడ్డికి, ఆయన భార్య భారతిరెడ్డిని ఆరువారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసులు పంపించింది. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్‌ 22వ తేదీకి వాయిదా వేసింది. మరి వారు కోర్టుకి ఏం సమాధానం చెపుతారో?

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories