differences-between-central-and-state-governments

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలకు 12 శాతం, బీసీలకు 37 శాతం రిజర్వేషన్స్ పెంచాలని శాసనసభలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపారు. తాజాగా సిఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలని మరో తీర్మానం చేసి ఢిల్లీ పంపారు.

తమిళనాడు ప్రభుత్వం వైద్య విద్యలో ప్రవేశాల కొరకు నిర్వహించే ‘నీట్’ పరీక్షల నుంచి తమిళ విద్యార్ధులకు మినహాయింపు ఇవ్వాలని రెండు సార్లు తీర్మానాలు చేసి పంపింది.

Also Read – ఇటు అమరావతి…అటు విశాఖ…!

నీట్ పరీక్ష వ్రాయకుండా 12 వ తరగతి మార్కుల ఆధారంగా వైద్యవిద్యలో ప్రవేశాలు కల్పించాలని వాటిలో కోరింది. నీట్ పరీక్షలలో మినహాయింపునిస్తూ తమిళనాడు శాసనసభలో ఆమోదించి పంపిన బిల్లుని కూడా రాష్ట్రపతి తిరస్కరించారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ మీడియాకు తెలియజేశారు. అయితే దీని కోసం కేంద్రంతో తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.

ఈవిదంగా ఒక్కో రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడల్లా అధికారంలోకి వచ్చినవారు తమ రాజాకీయ పార్టీల ప్రయోజనాల కోసం ఇష్టం వచ్చిన్నట్లు తీర్మానాలు చేసి ఢిల్లీకి పంపించడం పరిపాటిగా మారిపోయింది. అందుకే వాటిని కేంద్రం కూడా పట్టించుకోవడం మానేసింది.

Also Read – HIT 3: అడివి శేష్ ఫైట్ సీన్ లీక్‌తో సర్‌ప్రైజ్!

అయితే తమవి గొంతెమ్మ కోరికలని, కనుక వాటిని కేంద్రం ఆమోదించదని తెలిసి ఉన్నప్పటికీ ఎందుకు తీర్మానాలు చేసి పంపిస్తున్నారు?అంటే ప్రజల కోసం తమ ప్రభుత్వం పరితపించిపోతోందని, కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష చూపుతోందని చెప్పుకునేందుకు కావచ్చు.

ఈవిదంగా ప్రజలలో సెంటిమెంట్ రగిలించి తమ పార్టీలు మరింత బలపడేలా చేసుకునేందుకు కావచ్చు. ఈవిదంగా తమ తమ రాష్ట్రాలలో బీజేపి రాజకీయంగా బలపడకుండా, ఎదగకుండా అడ్డుకునేందుకు కావచ్చు. నాడు కేసీఆర్‌ ఇలాగే చేశారు నేడు రేవంత్ రెడ్డి, స్టాలిన్ కూడా ఇదే చేస్తున్నారు.

Also Read – సమంతకు గుడి కట్టిన అభిమానం

తమ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు దెబ్బతింటున్నా, ఆ కారణంగా రాష్ట్రాలు నష్టపోతున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే హిందీ భాషా వివాదం, డీలిమిటేషన్, వక్ఫ్ బిల్లు వంటి పలు అంశాల కారణంగా కేంద్రానికి రాష్ట్రాలకి మద్య దూరం పెరుగుతోంది.




ఇవి సరిపోవన్నట్లు ఈవిదంగా కొత్త కొత్త సమస్యలు సృష్టించడం సబబేనా?ఇదేవిదంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు దెబ్బ తీసుకుంటుంటే చివరికి ఏమవుతుంది? అని ఆలోచిస్తే ఇది ఎంత ప్రమాదకరమైన ధోరణో అర్దమవుతుంది.