‘గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, కంచె’ చిత్రాల దర్శకుడు క్రిష్ వివాహ ముహూర్తం, వేదిక ఖరారైంది. ఆగస్టు 8వ తేదీ తెల్లవారుజామున 2 గంటల 28 నిముషాలకు పరిణయ ముహూర్తంగా నిర్ణయించారు. హైదరాబాద్ లోని గండిపేటకు సమీపంలోని గోల్కొండ రిసార్ట్స్ లో క్రిష్, రమ్యల వివాహాం అత్యంత వైభవంగా జరపడానికి ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు.
గత నెలలో డాక్టర్ రమ్యతో క్రిష్ ఎంగేజ్ మెంట్ ను చాలా సింపుల్ గా నిర్వహించడంతో, వివాహ మహోత్సవాన్ని వైభవంగా జరపనున్నారని సమాచారం. సినీ, రాజకీయ వర్గాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారని తెలుస్తోంది. కాగా, ప్రముఖ హీరో బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి క్రిష్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. మొన్నటి వరకు ఈ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న క్రిష్, కొంచెం బ్రేక్ ఇచ్చారని.. తన పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారని ఫిలింనగర్ వర్గాల సమాచారం.



