క్యాష్ వాడుతున్నారా… అయితే మరో షాక్ తప్పదు..!

discounts for online paymentsనగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు మోడీ సర్కార్ సరికొత్త ప్లాన్స్ ను సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే పెట్రోల్ బంకులలో డెబిట్, క్రెడిట్ కార్డులను వినియోగిస్తే… 0.75 శాతం రిబేట్ ప్రకటించగా, మరిన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నది అసలు సమాచారం. ఒక వైపు ఇలా క్యాష్ లెస్ లావాదేవీలను ప్రోత్సహించే విధంగా రిబేట్ లను ప్రకటిస్తూనే, మరో వైపు నగదుతో చేసే పనులకు ‘ఎక్స్ ట్రా’ చార్జ్ లను విధించేందుకు సిద్ధమవుతోందని సమాచారం.

ADVERTISEMENT

అవును… ఇక ముందు డబ్బులను ఎలాంటి అవసరాల కోసం వినియోగించినా అదనపు ఛార్జీలను వసూలు చేసే విధంగా నిర్ణయం రాబోతోందని లభించిన కీలక సమాచారం. ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డులపై వసూలు చేసే అదనపు చార్జీల తరహాలో, త్వరలో క్యాష్ లావాదేవీలపై రాబోతుందన్న మాట. ఇలాంటి ప్రతిపాదనల్లో కేంద్రం ఉందని తెలిస్తే సామాన్యుడు మరొకసారి ఆగ్రహించక మానడు. ఇప్పటివరకు అలవాటైపోయిన విధానాలకు విరుద్ధంగా మోడీ సర్కార్ చేస్తున్న ప్రతిపాదనలకు ప్రజలు ఎంతవరకు మద్దతు తెలుపుతారో వేచిచూడాలి.

ADVERTISEMENT
Latest Stories