YSRCP

ప్రభుత్వం అంటే ప్రజలకు ఒక ప్రతినిధిగా బాధ్యతాయుతంగా నడిచే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ. అయితే ఈ ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకు వెళ్ళాలి.

అలా కాకుండా ప్రజలిచ్చిన అధికారాన్ని ఒక వ్యాపార అవకాశంగా, తన వ్యక్తిగత అవసరాలకు, తన పార్టీ భవిష్యత్ కు, ఉపయోగించుకున్నారు మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి. దాని ఫలితమే నేటి వైసీపీ కి ఈ దుస్థితి.

Also Read – వైసీపీ రిచ్ కాదు రిచెస్ట్…

ఉచితపథకాలు, బటన్ నొక్కడాలు ,ఫేక్ ప్రచారాలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, కక్ష్య సాధింపు రాజకీయాలు, వ్యక్తిగత దాడులు, రాజకీయాలకు బూతులు పరిచయం చేయడం, అసాంఘిక శక్తులను ప్రోత్సహించడం, ప్రత్యర్థి పార్టీల నేతల మీద సోషల్ మీడియాలో అస్లీల పోస్టులు పెట్టడం….ఇలా వైసీపీ ‘ప్రభుత్వం’ అనే మాటకు అర్ధాన్నే మార్చేసింది.

రాజకీయాల కోసం తానూ నమ్ముకున్న విలువలు విశ్వసనీయత అనే సిద్ధాంతాన్ని వదులుకోలేనని, అలాగే గెలుపు కోసం ప్రజలను ఏమార్చే అబద్దాలు చెప్పలేని జగన్ చెపుతున్న చిలక పలుకులు వింటుంటే రాజకీయాలలో ఇంతకన్నా పెద్ద అబద్దాలు ఏమైనా ఉన్నాయా.? అంటూ జగన్ రాజకీయ చరిత్రలో చెప్పిన అతి పెద్ద అబద్దాల లిస్టుతో సోషల్ మీడియాలో జగన్ మీద ట్రోలింగ్ కూడా చాలా పెద్దగానే నడుస్తుంది.

Also Read – ఈ ఒక్క ప్రెస్‌మీట్‌ చాలదూ.. ఏపీ భవిష్యత్‌ తెలుసుకోవడానికి!

వివేకా హత్య ను సాక్షి గుండె పాటుగా మార్చింది నిజమా.? అబద్దమా.? జగన్ చెప్పాలి. అలాగే దానిని నారసురా రక్త చరిత్ర అంటూ ప్రచారం చేసిన జగన్ మాటలలో వాస్తవం ఎంతా.? జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏపీ రాజధాని అమరావతే అంటూ ప్రజలను ఏమార్చింది అబద్దం కాదా.?

అధికారం కోసం అమలు సాధ్యం కానీ మధ్య నిషేధం వంటి హామీలిచ్చి అధికారం అందిన వెంటనే ఆ హామీలతోనే వ్యాపారం చేయడమేనా జగన్ విలువలు.? తన రాజకీయ అవసరాల కోసం తల్లిని, చెల్లిని రాజకీయ వేదికల మీదకు తెచ్చి తన అవసరం తీరగానే ఆ కుటుంబసభ్యుల పైనే తన సొంత సాక్షిలో వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేయడమేనా జగన్ విశ్వసనీయత.?

Also Read – హేళన చేసినవారు అక్కడే ఉండిపోయారు.. కానీ లోకేష్‌ ఎక్కడో!

గత ఐదేళ్ల అధికారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ చేసింది ఏమిటి అని ఒక్కసారి ఆలోచిస్తే సంక్షేమం పేరుతో ఉచిత పథకాల కోసం ఆరు నెలలకోసారి బటన్ నొక్కే కార్యక్రమలు చేయడం…రోజుకోసారి తమ ప్రత్యర్థి నాయకుల మీద బూతులతో కూడిన విమర్శలు చేయడం…అధికారం ఉంటే చాలు, ప్రభుత్వం మనదైతే చాలు అన్నట్టుగా వైసీపీ అరాచకాలు ఏపీ నుండి ఢిల్లీ దాక విస్తరించాయి.

అభివృద్ధి అనే పదాన్ని ఏపీలో బాన్ చేసారా అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్ల తన అరాచకానికి విలువలు విశ్వసనీయత అంటూ పేర్లు పెట్టుకుని అబద్దాలు చెప్పలేను అంటూ అతి పెద్ద అబద్దాలు చెపుతూ ప్రజలిచ్చిన తీర్పును కూడా అంగీకరించలేకపోతున్నారు.

ఇప్పుడు వైసీపీకి వచ్చిన ఈ ఫలితం గత వైసీపీ ప్రభుత్వం చేసిన విలువలు లేని రాజకీయానికి, చెప్పిన అబద్ధాలకు, విశ్వసనీయత లేని పాలనకు అర్ధం అనేది వైసీపీ శ్రేణులు సైతం గ్రహించినా ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గ్రహించలేకపోతున్నారు వై.?